Bolisetti Satyanarayana: బొలిశెట్టికి పార్టీతో ఎలాంటి సంబంధం లేదన్న జనసేన.. ధన్యవాదాలు తెలిపిన సత్యనారాయణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bolisetti Satyanarayana: బొలిశెట్టి సత్యనారాయణకు పార్టీతో ఇకపై ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది జనసేన పార్టీ.. ఆయన పదవుల నుంచి తప్పుకోవాలన్న అభ్యర్థనను పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంగీకరించినట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇకపై బొలిశెట్టి సత్యనారాయణ నిర్వహించే కార్యక్రమాలకు జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం ఉండదని పేర్కొంది.. ఆయన స్వచ్ఛందంగా బాధ్యతల నుంచి తప్పుకోవడంతో వెంటనే విముక్తి కల్పించినట్లు వెల్లడించింది.
జనసేనకు బొలిశెట్టి ధన్యవాదాలు
ఇక, జనసేన పార్టీ నిర్ణయంపై స్పందించిన మాజీ జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ.. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ మరియు మానవ హక్కుల కోసం మరింత చురుకుగా పనిచేయాలనే తన అభ్యర్థనను గౌరవించి, బాధ్యతల నుంచి విముక్తి కల్పించారని అన్నారు.. పార్టీతో అధికారికంగా దూరమైనప్పటికీ, సిద్ధాంత పరంగా అనుబంధం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ దిశగా పని చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Also Read
పర్యావరణ పరిరక్షణపై దృష్టి
కొల్లేరు సరస్సు రక్షణతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చిత్తడి నేలల పరిరక్షణ, భూ వినియోగ మార్పిడి నియంత్రణ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని సత్యనారాయణ సూచించారు. పర్యావరణ ప్రభావ అంచనాలు లేకుండా జరుగుతున్న ఆక్రమణలను అడ్డుకోవాలని కోరారు. పర్యావరణ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ అంశాల్లో చొరవ చూపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తంగా, బొలిశెట్టి సత్యనారాయణ పార్టీ బాధ్యతల నుంచి వైదొలగినప్పటికీ, పర్యావరణ పరిరక్షణ దిశగా తన సేవలను కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
శ్రీ బొలిశెట్టి సత్యనారాయణకు జనసేన పార్టీతో ఎటువంటి అనుబంధం లేదని తెలియచేస్తున్నాము. pic.twitter.com/Xo1aBaiqAH
— JanaSena Party (@JanaSenaParty) March 25, 2026
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!