Warangal: వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని గుబ్బేటి తండాలో రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. కొడుకు సురేష్ సపావత్.. తన తండ్రి సపావత్ రాజ్ (56) పై దారుణంగా దాడి చేసి చంపాడు. ఈ ఘటనకు సంబంధించి, సురేష్ తన భార్య మౌనికను హింసించడమే. కోడలిని తండ్రి ఆపడానికి వెళ్లిన సమయంలో సురేష్ ఛాతీపై దాడి చేయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే..
Charlapally Drug Case: డ్రగ్ సరఫరా కోసం గ్యాంగులు.. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా తో కూడా సంబంధాలు!
రెండు సంవత్సరాల క్రితం సురేష్ మరో మహిళతో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం కాస్త భార్య మౌనికకు తెలియడంతో.. తనను అడ్డు తొలగించుకోవాలని సురేష్ నిరంతరం వేధిస్తున్నాడు. ఈ ఘర్షణల నేపథ్యంలో, తండ్రి కలుగ చేసుకోవడంతో ఈ విషాదకర పరిణామం చోటుచేసుకుంది. సురేష్ తరచూ భార్యను కొడుతూ హింసించేవాడని భార్య పేర్కొంది. అంతేకాకుండా సురేష్ ఆమెకు మందు డబ్బా ఇస్తూ, “తాగి చనిపో” అని అనేవాడని భార్య తెలిపింది. ఇక ఘటన వివరాలు తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ఆ తర్వాత సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది.
Drugs Rocket: చర్లపల్లిలో డ్రగ్స్ డెన్.. వెలుగులోకి దారుణ విషయాలు!