Crime: డబ్బు కోసం స్నేహితులతో భార్యపై అత్యాచారం.. మూడేళ్లుగా నరకం..
- ఉత్తర్ ప్రదేశ్ బులంద్‌షహర్‌లో దారుణం..
- డబ్బుల కోసం భార్యపై స్నేహితులతో అత్యాచారం..
- మూడేళ్లుగా సాగుతున్న అఘాయిత్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: కలకాలం భార్యని కాపాడాల్సిన భర్త దారుణానికి ఒడిగట్టాడు. యూపీలో బులంద్‌షహర్‌లో ఒక వ్యక్తి తన భార్యపై స్నేహితులతో అత్యాచారం చేయించాడు. ఈ చర్యను వారు వీడియో రికార్డ్ చేశారు. ముగ్గురిపై కేసు నమోదైంది. భర్త తన స్నేహితులకు తనపై అత్యాచారం చేయడానికి అనుమతించాడని ఫిర్యాదులో మహిళ పేర్కొంది. గత మూడు సంవత్సరాలుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నట్లుగా చెప్పింది. తాను గర్భవతినని, తన భర్త సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడని వెల్లడించింది.
Read Also: Telangana: “భూభారతి”కి గవర్నర్ ఆమోదం.. వీలైనంత త్వరగా అమలులోకి
Also Read
- Child S*exual Abuse Content: ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
తనపై అత్యాచారానికి అనుమతించడం ద్వారా ఇద్దరు స్నేహితుల నుంచి భర్త డబ్బులు తీసుకున్నాడని 35 ఏళ్ల మహిళ ఆరోపించింది. తన బాధను చెప్పుకుంటే, ఎవరితో చెప్పవద్దని కోరినట్లు ఆమె చెప్పింది. ఇద్దరు నిందితులు లైంగిక చర్యల్ని రికార్డ్ చేసేవారని, తన భర్త సౌదీ అరేబియాలో వీడియోలు చూసేవాడని తెలిపింది.
నివేదిక ప్రకారం.. సదరు మహిళకు 2010లో బులంద్‌షహర్ వ్యక్తితో వివాహం జరిగింది. ఆ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. సౌదీ అరేబియాలో ఆటోమొబైల్ మెకానిక్‌గా పనిచేస్తున్న ఆమె భర్త ఏడాదికి రెండుసార్లు సొంతూరుకి వస్తాడు. మూడేళ్ల క్రితం భర్త ఇంటికి వచ్చినప్పుడు తన ఇద్దరు స్నేహితులు ఆమెపై అత్యాచారం చేయడానికి అనుమతించాడని తెలిసింది. భర్త సౌదీకి వెళ్లిన తర్వాత కూడా ఈ అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. పిల్లల కోసం ఇదంతా మౌనంగా భరించినట్లు చెప్పింది, ఎవరితో అయినా చెబితే విడాకులు ఇస్తానని బెదిరించేవాడని వెల్లడించింది. ఇటీవల బంధువుల్లో ఒకరు ఆమె ఇంటికి వెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబం అండగా నిలవడంతో ఆమె తన భర్తపై ఫిర్యాదు చేసింది. ఇప్పటి వరకు నిందితుల అరెస్ట్ జరగలేదని, తదుపరి విచారణ జరుగుతోందని తెలిసింది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..