Constables Suicide: తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుళ్ల ఆత్మహత్యలు సంచలనంగా మారాయి. ఒకే రోజు ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్ల ఆత్మహత్య ఉమ్మడి మెదక్ జిల్లాలో కలకలం రేపింది. వేర్వేరు కారణాలతో సాయి కుమార్, బాలక్రిష్ణ అనే కానిస్టేబుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. కొల్చారం పోలీస్ స్టేషన్ లో చేట్టుకు ఉరివేసుకుని హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. సాయి కుమార్ ఆత్మహత్యకి వివాహేతర సంబంధమే కారణమని అనుమానం. మరోవైపు సిద్దిపేటలో కుటుంబంతో సహా బాలక్రిష్ణ అనే మరో కానిస్టేబుల్ ఆత్మహత్యయత్నం చేసుకున్నారు. పురుగుల మందుతాగిన తర్వాత బాలక్రిష్ణ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Read also: MLC Kavitha: నేడు నిజామాబాద్‌కు ఎమ్మెల్సీ కవిత.. ఇందల్వాయి టోల్ గేట్ వద్ద నుంచి భారీ ర్యాలీ
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలకుంట కాలనీలో 17వ బెటాలియన్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భార్యకు నీళ్లలో ఎలుకల మందు, పిల్లల్లకు పాలల్లో పురుగుల మందు కలిపి ఇచ్చి బాలకృష్ణ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలకృష్ణ మృతి చెందారు. పురుగుల మందు తాగిన అతని భార్య, పిల్లలను స్థానికులు గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నా పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న వన్ టౌన్ పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు.
Read also: Hyderabad Police: న్యూ ఇయర్ ఎఫెక్ట్.. పబ్‌లు, బార్‌లపై పోలీసుల ఫోకస్..
మరోవైపు మెదక్ జిల్లా కొల్చారం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సాయికుమార్ ఎస్ఐ క్వార్టర్ ఆవరణలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయి కుమార్ మృతికి వివాహేతర సంబంధమే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. నిన్న అర్ధరాత్రి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. సాయి కుమార్ స్వస్థలం మెదక్ జిల్లా నర్సాపూర్ కాగా.. వివాహేతర సంబంధతోనే ఆత్మహత్యకు కారణాలా? లేక కుటుంబ కలహాలా? నిన్న కుటుంబంతో మాట్లాడిన సాయికుమార్ ఏం మాట్లాడాడు అనే కారణాలతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Komuravelle: నేడు మల్లికార్జున స్వామి కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రులు