ఎన్ని చట్టా చేసినా.. ఎన్ని కఠిన శిక్షలు వేసినా మృగాళ్లు మాత్రం మారడం లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండా విచక్షణరహితంగా తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఈ రోజు అంతర్జాతీయ మహిళ దినోత్సవం.. ఈ రోజు ఏ ఒక్క మగాడిని అడిగిన అమ్మ గురించి.. అంతేకాకుండా తన అక్కచెల్లెళ్లు, భార్య ఇతరుల గురించి ఎంతో గొప్పగా చెబుతుంటారు. అయితే ఈ రోజునే ఓ ఇద్దరు కామాంధులు స్వదేశానికి వచ్చిన పరదేశి యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో ఇది గమనించిన స్థానికులు ఆ యువతిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
వివరాల్లోకి వెళితే.. బ్రిటన్ దేశం లితోనియా ప్రాంతానికి చెందిన కరోలినా(25) అనే యువతిపై చాగణం సమీపంలోని అటవీ ప్రాంతంలోని రాపూరు రోడ్డు వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలని స్థానికులు, పోలీసులు నెల్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే నిందుతులు గూడురుక చెందిన అబిడ్, సాయి కుమార్‌లుగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా వారిపై 354 ఏ, 323, 376 రెడ్ విత్ 511 120 బి, సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.