కేరళలో దారుణం చోటుచేసుకొంది. అధికార పార్టీ నేత ఆగడాలకు ఒక అబల బలైపోయింది. బలవంతంగా ఆమెను అనుభవించి, ఆ దృశ్యాలను వీడియో తీసి బెదిరింపులకు పాల్పడి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.. ఆమె డబ్బు ఇవ్వనని చెప్పడంతో ఆమె నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆమె పరువు తీశాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తిరువల్ల పరిధిలోని స్థానిక సీపీఎం నేత గతేడాది మే నెలలో తన పార్టీలో పనిచేసే మహిళా కార్యకర్తను నమ్మించి కారులో తీసుకెళ్లాడు. ఆమెకు తెలియకుండా కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఆమెచేత తాగించి, కారులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను వివస్త్రను చేసి నగ్న వీడియోలను చిత్రీకరించాడు. ఆ సమయంలో అతడితో పాటు 12 మంది ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత ఆమెకు ఆ వీడియోలు చూపించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆమె తన దగ్గర అంత డబ్బులేదని, తాను ఇవ్వలేనని చెప్పింది. అయితే ఆ నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి కొంతడబ్బు తీసుకున్నాడు.
ఇలా తనకు కావలసినప్పుడల్లా ఆమె దగ్గర డబ్బు తీసుకొంటున్నాడు. ఇక ఇటీవల మహిళ తనవద్ద డబ్బులేదని, డబ్బు ఇవ్వడం కుదరదని తెగేసి చెప్పడంతో కోపంతో రగిలిపోయిన సదరు నేత ఆమె నగ్న వీడియోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు. దీంతో అవి కాస్త వైరల్ గా మరి మహిళ పరువు పోయింది. వెంటనే మహిళ తనకు న్యాయం చేయాలనీ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 12 మందిలో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నామని, మిగతావారు పరారీలో ఉన్నట్లు తెలిపారు.