POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
- మైనర్‌పై లైంగిక దాడి ఆరోపణలతో కేసు నమోదు
- ఫొటోలు వైరల్ చేస్తామని బెదిరింపులు
- భార్య, బంధువు సహకారం వెలుగులోకి
- నిందితులను రిమాండ్‌కు తరలించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
POCSO Case : ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో ఒక మైనర్ బాలికపై జరిగిన దారుణమైన లైంగిక దాడి ఉదంతం కలకలం రేపుతోంది. బాలికను బెదిరించి, బ్లాక్మెయిల్ చేస్తూ ఘోరానికి పాల్పడిన కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ (GST) శాఖ సీనియర్ అసిస్టెంట్ రామ్మూర్తితో పాటు, ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన అతని భార్య, రైల్వే కోడూరు డిప్యూటీ తహసిల్దార్లను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి తూర్పు (ఈస్ట్) పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అమానుష ఘటన వెలుగుచూసింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు రామ్మూర్తి సదరు మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే బాలికకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని భయపెట్టాడు. అంతేకాకుండా, నోరు విప్పితే బాలిక తల్లిదండ్రులను సైతం చంపేస్తానంటూ తీవ్రంగా హెచ్చరించి బ్లాక్‌మెయిల్‌కు గురిచేశాడు. ఈ వేధింపులు భరించలేక బాధితురాలు హైదరాబాదులోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, అక్కడ తొలుత ‘జీరో ఎఫ్ఐఆర్’ (Zero FIR) నమోదు చేశారు. ఘటన తిరుపతిలో జరగడంతో ఆ కేసును జగద్గిరిగుట్ట పోలీసులు తిరుపతి పోలీసులకు బదిలీ చేశారు.
Also Read
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
- Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
కేసును స్వీకరించిన తిరుపతి ఈస్ట్ పోలీసులు నిందితుడు రామ్మూర్తిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, ఈ వ్యవహారంలో నిందితుడైన రామ్మూర్తిని కేసు నుంచి తప్పించేందుకు, బాధితురాలిని లొంగదీసుకునేందుకు అతని భార్య (డిప్యూటీ తహసిల్దార్) తో పాటు, బాలికకు వరుసకు పిన్ని అయిన మానస అనే మహిళ కూడా సహకరించినట్లు విచారణలో తేలింది. దీంతో పోలీసులు రామ్మూర్తితో పాటు సహకరించిన పిన్ని మానసను కూడా అరెస్ట్ చేశారు. నిందితులందరినీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ప్రభుత్వ అధికారిణి అయిన భార్య పాత్రపై విచారణ జరుపుతున్నామని, విధుల్లో నిర్లక్ష్యం వహించి క్రైమ్‌కు సహకరించినందుకు ఆమెపై కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు.
ఈ కేసు వివరాలను తిరుపతి డీఎస్పీ భక్తవత్సలము మీడియాకు వెల్లడించారు. మైనర్ పిల్లలపై ఇలాంటి వేధింపులు, లైంగిక దాడులు జరుగుతున్నప్పుడు భయపడి దాచిపెట్టవద్దని ఆయన తల్లిదండ్రులకు, బాధితులకు విజ్ఞప్తి చేశారు. సమాజంలో ఇటువంటి కీచకులపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావాలన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసే బాధితుల వివరాలను, వారి గోప్యతను (Privacy) పూర్తిగా కాపాడుతామని, బాధితులకు న్యాయం జరిగేలా శరవేగంగా దర్యాప్తు పూర్తి చేస్తామని డీఎస్పీ భక్తవత్సలము హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
KTR: కరెంట్ కోతలపై కేటీఆర్ ఫైర్.. ‘ఇది ఎల్ నినో కాదు.. ఎల్ కాంగ్రెస్’.!
-
YS Jagan: అవినీతి ఏ స్థాయికి వెళ్లిందో చెప్పడానికి డీఎస్సీనే ఉదాహరణ!
-
SIR Row: ఈసీలో అంతర్గత విభేదాలు.. ‘‘దేశ ద్రోహం’’ అంటూ రాహుల్ విమర్శలు..
-
Banks Open on Sunday: బ్యాంక్ సమ్మెకు ముందు కీలక నిర్ణయం.. ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!