తిరుపతి జిల్లా వడమాలపేటలో మూడున్నరేళ్ల చిన్నారి హత్యాచారంపై ఘటనపై విచారం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ ఘటనలో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.. వడమాల పేట మండలం ఎఎంపురం గ్రామ చిన్నారి హత్యాచారానికి గురైన బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలుపుతూ.. రూ.10 లక్షలను బాధిత కుటుంబానికి అందచేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ను ఆదేశించారు సీఎం చంద్రబాబు.
తిరుపతిలో మరో మైనర్ బాలిక.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమని వ్యక్తి మాటల్లో పడి సర్వం అర్పించింది.. చివరకు ప్రాణాలతో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడే పరిస్థితి వచ్చింది..
తిరుపతిలో ఓ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు.. తిరుపతి రూరల్ లో ఓ ప్రైవేట్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్‌గా ఉన్న వెంకటప్రసాద్.. స్థానికంగా శ్రీపురం కాలనీలో నివాసం ఉంటున్నారు.. 2012లో తిరుపతికి చెందిన మాధురిని ప్రేమించి.. పెళ్లి చేసుకున్నాడు వెంకట ప్రసాద్ ..
తిరుపతిలో సినిమా థియేటర్‌లో జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. నగరంలోని ఓ సినిమా థియేటర్‌లో యువకుడు కత్తిపోట్లకు గురైన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. తిరుపతిలోని పీజీఆర్ సినిమా థియేటర్‌లో ఈ ఘటన జరిగింది.
తిరుపతిలో విద్యార్థులు రెచ్చిపోయారు. నగరంలోని ఓ సినిమా థియేటర్‌ల యువకుడు కత్తిపోట్లకు గురైన ఘటన కలకలం సృష్టిస్తోంది. ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. తిరుపతిలోని పీజీఆర్ సినిమా థియేటర్‌లో ఈ ఘటన జరిగింది. గాయపడిన విద్యార్థి లోకేశ్‌ను మోహన్‌బాబు యూనివర్సిటీ(ఎంబీయూ) విద్యార్థిగా గుర్తించారు.
తిరుపతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ బాలికల పరిశీలన గృహం(జువైనల్ హోమ్) లో ఉండే బాలికపై అత్యాచారయత్నం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి నగరంలో అనాథ బాలికలతో పాటు నేర చరిత్ర ఉన్న బాలికల కోసం ప్రత్యేక వసతి గృహం ఉంది. ఈ వసతి గృహంలో ఉండే బాలికలు వివిధ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో గృహంలో ఉంటూ స్థానిక నెహ్రూ మున్సిపల్ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న ఓ…
టెంపుల్ సిటీ అయిన తిరుపతిలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి ముగ్గురిని హత్య చేసి, అనంతరం తానూ ఆత్మహత్య చేసుకోవడం తిరుపతి పద్మావతి నగర్‌లో కలకలం రేపుతోంది. అన్నమీద కోపంతో ఓ తమ్ముడు.. వదినతో పాటు, వారి ఇద్దరి కూతుళ్లను కిరాతకంగా నరికి చంపిన ఘటన పద్మావతి వర్సిటీ సమీపంలోని పద్మావతి నగర్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
తిరుపతిలోని సుబ్బారెడ్డి నగర్‌లో కిషోర్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.. ఈ హత్య ఎందుకు? జరిగింది? ఎవరి పని కావొచ్చు అనేదానిపై పోలీసుల చెబుతున్న వివరాల ప్రకారం.. తనకు పరిచయం ఉన్న యువతిన వేధిస్తున్న వారికి వార్నింగ్ ఇచ్చాడట కిషోర్.. మరోసారి ఆ యువతి జోలికి రావొద్దని హెచ్చరించాడట.. దీంతో, కిషోర్‌కు ఆ పోకిరీల మధ్య చిన్నపాటి వివాదం చోటు చేసుకుఒంది.. అది కాస్తా ఘర్షణకు దారితీసింది.. ఆ తర్వాత కత్తులతో కిషోర్‌పై దాడిచేసి చంపేశారు…