TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. బంగారం, నగదుతోపాటు ఆఖరికి చిల్లర వస్తువులు.. చివరికి పశువులను కూడా దొంగిలించారు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ దోపిడీ ఘటనలు తెలుగు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ PMJ జ్యువెలరీ దోపిడీ ఘటన మర్చిపోక ముందే.. కరీంనగర్లో దోపిడీ దొంగలు మరోసారి పంజా విసిరారు. ఉత్తరాది నుంచి వచ్చిన దొంగలు.. హల్చల్ చేసి.. నిమిషాల్లో అందినకాడికి దోచుకుని పారిపోయారు.
Also Read
- AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
- TVK Leader Mu*rd*er: టీవీకే నేత దారుణ హత్య.. వెంటాడి కొడవళ్లతో దాడి.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
- Delhi Building Collapse: సెకన్లలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. CCTVలో భయానక దృశ్యాలు, 6 మంది మృతి
- Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
అది.. కరీంనగర్‌లోని భగత్ నగర్ ప్రాంతం.. సమయం సరిగ్గా అర్ధరాత్రి 12. 15 నిమిషాలు… దోపిడీ దొంగలు ఓ ఇంట్లోకి చొరబడ్డారు. దాదాపు 8 మంది దొంగలు.. చొరబడి 20 లక్షలకు పైగా నగదుతోపాటు 60 తులాల బంగారం ఎత్తుకుని పరారయ్యారు. అంతే కాదు దోపిడీ సమయంలో కుటుంబంలోని వ్యక్తులపైనా దాడికి దెగబడ్డారు. ఈ దాడిలో ఇంటి యజమాని అజ్మత్ అలీకి ముక్కుపై గాయాలయ్యాయి. కుటుంబీకులను కట్టేసి… డమ్మీ తుపాకులతో బెదిరించారు దొంగలు. ఆ తర్వాత నేరుగా ఎక్కడైతే డబ్బు, నగలుంటాయో ఆ రూంలోకి వెళ్లి.. అంతకు ముందే ఎత్తిన చిట్టీ డబ్బులతో సహా మొత్తం దోచుకెళ్లారు. పక్కా ప్లాన్‌తో వచ్చిన దుండగులు తిరిగి వెళ్లేందుకు అక్కడే పార్క్ చేసిన బైక్‌లను కూడా చోరీ చేసి ఎత్తుకెళ్లారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.. స్పాట్
దొంగతనం జరిగిన వెంటనే కుటుంబీకులు చేసిన ఫోన్ కాల్‌తో.. నగరంలోనే వేరే చోట నివాసం ఉండే కొడుకు అస్వత్ అలీ వెంటనే ఇంటికి చేరుకున్నారు. వెంటనే వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు దోపిడీ దొంగలు లోనికెలా వచ్చారు..? ఏం జరిగింది..? ఇంటి అల్లుడే దొంగ అనే అంశాలపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే.. కుటుంబ కలహాలే ఈ దొంగతనానికి కారణమన్నట్టుగా తేలడంతో.. ఈ దోపిడీ కేసు ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. అజ్మత్ అలీ పూర్వీకులు ఉత్తరప్రదేశ్ లోని మీరట్‌కు చెందినవారు… తరాల నుంచే వారిక్కడ ఉంటున్నారు. మీరట్ కి చెందిన పెద్దల్లుడు రవూఫ్‌తో గొడవల నేపథ్యముండగా.. రవూఫ్‌పై మీరట్‌లోనూ, ఢిల్లీలోనూ కొన్ని కేసులున్నట్టుగా తెలుస్తోంది.
నాలుగు బృందాలతో పోలీసుల గాలింపు
ఆరుగురు నుంచి ఎనిమిది మంది దొంగలు దొంగతనానికి పాల్పడ్డట్టు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం వెల్లడించారు. మీరట్, ఢిల్లీలో నిందితులపై కేసులున్నట్టు చెప్పారు. దొంగల కోసం గాలింపు చేపట్టామన్నారు. ఇప్పటికే నాలుగు బృందాలు గాలింపు చేపట్టాయని… మీరట్‌కు కూడా గాలింపు బృందాలను పంపిస్తున్నట్టు సీపీ గౌష్ ఆలం వెల్లడించారు. అయితే, ప్రాథమికంగా తమకు కుటుంబీకుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు.. ఆ ఇంటి అల్లుడే ఈ దోపిడీకి స్కెచ్ వేసి ఉండొచ్చనే అనుమానాలున్నాయన్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్టు సీపీ తెలిపారు.
PMJ జ్యువెలరీ దోపిడీ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపి.. పోలీస్ ట్రైనింగ్‌లో ఒక కేస్ స్టడీగా మారిన నేపథ్యంలో.. మళ్లీ అటువంటి ఒక ప్రొఫెషనల్ డెకాయిట్ కేసు కరీంనగర్లో జరగడంతో అందరి దృష్టి కరీంనగర్‌పై పడ్డట్టయింది. PMJ జ్యువెలరీ కేసు తర్వాత పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశామని చెబుతున్నప్పటికీ పోలీసుల ప్రకటనలను తూచ్ అన్నట్టు జరిగిన ఈ దోపిడీ ఇప్పుడు నైట్ పెట్రోలింగ్ తీరుపైనా, నిఘాపైన ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తోంది.
మరోవైపు వేములవాడలో దొంగలు బీభత్సం సృష్టించారు. జాతర గ్రౌండ్‌లోని పది దుకాణాలను లక్ష్యంగా చేసుకున్న దుండగులు, దొంగతనం చేసేందుకు వచ్చిన దుకాణంలో దర్జాగా వంట చేసుకుని భోజనం చేసి మరీ చోరీలకు పాల్పడటం సంచలనంగా మారింది. సుమారు రూ 3 లక్షల విలువైన వస్తువులు,దాదాపు రూ 30 వేల నగదును అపహరించినట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటనలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… వంట సామాగ్రి అద్దె దుకాణంలోకి ప్రవేశించిన దొంగలు అక్కడే కోడిగుడ్ల కూర, బగారా రైస్ వండుకుని ప్రశాంతంగా భోజనం చేశారు. అనంతరం శీతల పానీయాలు తాగి ఆ తర్వాతే దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తుండగా, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ భారీ బంగారం చోరీ కేసును టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక కిలో 28.59 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జులై 17న కర్ణాటకకు చెందిన సోంకాంబ్లే హరీష్, సోంకాంబ్లే ఆకాష్ చోరీకి పాల్పడ్డారు. వారిద్దరూ అన్నదమ్ములు. హరీష్.. గురుకృప ఎక్స్‌పోర్ట్స్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తుండగా.. ఆకాష్ హైటెక్ సిటీలోని PWC ఐటీ కంపెనీలో ఆఫీస్ బాయ్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. పథకం ప్రకారం గురుకృప ఎక్స్పోర్ట్ లో వెనుక నుంచి వెళ్లి లాకర్లో ఉన్న బంగారాన్ని దొంగలించారు. హరీష్ గతంలో అదే కంపెనీలో సేల్స్ మెన్ గా పనిచేశాడు. హరీష్ పనిచేస్తున్న సంస్థలో నగల నిల్వ, డెలివరీ విధానంపై పూర్తి అవగాహన కలిగి ఉండటంతో.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన సోదరుడు ఆకాష్‌తో కలిసి చోరీకి పథకం రచించాడు.
జులై 16న చేసిన తొలి ప్రయత్నం విఫలమైనప్పటికీ… జులై 17న కార్యాలయ బాత్రూమ్ కిటికీ గ్రిల్‌ను పగులగొట్టి లోపలికి ప్రవేశించారు ఇద్దరు అన్నదమ్ములు. లాకర్లో ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలించారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జాతీయ రహదారిపై పశువుల వాహనాల డ్రైవర్లను కత్తులతో బెదిరించి నగదు దోచుకున్న కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి రాజమహేంద్రవరానికి చెందిన 10 మంది యువకులను అరెస్టు చేశారు. నిందితులు సెల్‌ఫోన్ షాపుల యజమానులు, ఉద్యోగులుగా పోలీసులు గుర్తించారు.
శ్రీకాకుళం జిల్లా నుంచి అమరావతి సమీపంలోని కోనూరుకు ఆరు ఎద్దులను రెండు వాహనాల్లో తరలిస్తుండగా.. రాజానగరం జాతీయ రహదారి వద్ద డ్రైవర్లు కాలకృత్యాల కోసం వాహనాలు ఆపారు. అదే సమయంలో థార్, సుజుకి కార్లలో వచ్చిన 10 మంది యువకులు కత్తులతో బెదిరించి డ్రైవర్లపై దాడికి పాల్పడ్డారు. దుండగులు ఒక డ్రైవర్‌ను బలవంతంగా కారులో ఎక్కించి పల్లకడియం శివారులోని పొలాల్లోకి తీసుకెళ్లి నగదు లాక్కున్నారు. మరోవైపు పశువులతో ఉన్న వాహనాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకుని దోపిడీకి పాల్పడ్డారు.
బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రాజానగరం పోలీసులు దర్యాప్తు చేపట్టి రాజమహేంద్రవరానికి చెందిన 10 మంది నిందితులను అరెస్టు చేశారు. నేరానికి ఉపయోగించిన థార్, సుజుకి కార్ల నెంబర్ ప్లేట్లను గుర్తుపట్టకుండా గుడ్డలతో కప్పివేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!