Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
- ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్
- మెట్రో స్టేషన్లు తెరవకపోతే జోక్యం చేసుకుంటా
- సీజేఐ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కొద్దిరోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. గత సోమవారం ఆందోళనలు ఉధృతం అయ్యాయి. విద్యార్థులపై లాఠీఛార్జ్ కారణంగా పలువురు గాయపడ్డారు. అప్పటి నుంచి ఉద్యమం ఉధృతం అయింది. విపక్ష పార్టీలు కూడా మద్దతుగా నిరసనలు తెలుపుతున్నారు.
విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో పలు మెట్రో స్టేషన్లను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ మూసేసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులతో పాటు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో స్టేషన్లు మూసివేయడంపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యాహ్న భోజన విరామం (లంచ్)లోపు సమస్యకు పరిష్కారం లభించకపోతే తానే స్వయంగా జోక్యం చేసుకుంటానని స్పష్టం చేశారు. ఢిల్లీ మెట్రో స్టేషన్ల మూసివేత కారణంగా న్యాయవాదులు, వ్యాజ్యదారులు, సుప్రీంకోర్టు సిబ్బంది కోర్టుకు చేరుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తరఫున వినతిపత్రం దాఖలైంది.
Also Read
- Tamil Nadu: విడాకుల సందర్భంగా భార్య ‘కుక్క’తో పోలిక.. ధర్మాసనం తీరుపై విమర్శలు
- US Politics: ఆర్ఎస్ఎస్ విరాళాలు తీసుకోం.. భగవత్ పర్యటన తర్వాత, 90 మంది అమెరికన్ నేతల ప్రతిజ్ఞ..
- Supreme Court: ప్రభుత్వ స్కూళ్లలో జర్నలిస్టులు, యూట్యూబర్లపై ఆంక్షలు.. CJPకి సుప్రీంకోర్టు షాక్..
- Imran Masood: ‘నా కూతురు 6 నెలలుగా ఇంట్లోనే ఉంది’.. అల్లుడు ఎస్పీలో చేరడంపై కాంగ్రెస్ ఎంపీ ఆవేదన
సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ఎస్సీబీఏ అధ్యక్షుడు వికాస్ సింగ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్‌తో పాటు సమీపంలోని ఇతర స్టేషన్లను కూడా మూసివేయడంతో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, వ్యాజ్యదారులు సుప్రీంకోర్టుకు చేరుకోలేకపోతున్నారని వివరించారు. ఈ సందర్భంగా సీజేఐ స్పందిస్తూ.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా న్యాయవాదులు కోర్టుకు హాజరు కాలేకపోయినా… కేవలం ఆ కారణంతో ఏ కేసులోనూ ప్రతికూల ఉత్తర్వులు జారీ చేయొద్దని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్‌ను పూర్తిగా మూసివేయకుండా… న్యాయవాదులు, వ్యాజ్యదారులు, కోర్టు రిజిస్ట్రీ సిబ్బందికి మాత్రమే పరిమిత ప్రవేశం కల్పించాలని వికాస్ సింగ్ కోర్టును కోరారు. మెట్రో నుంచి బయటకు వచ్చే దగ్గర భద్రతా తనిఖీలు నిర్వహించి, సుప్రీంకోర్టు ప్రాక్సిమిటీ కార్డు లేదా అధికారిక గుర్తింపు కార్డు ఉన్నవారిని మాత్రమే బయటకు అనుమతించాలని సూచించారు. ఈ ప్రతిపాదనపై స్పందించిన సీజేఐ.. ఢిల్లీ మెట్రో అధికారులతో సంప్రదించి ఈ అంశాన్ని పరిశీలించాలని ఇప్పటికే సుప్రీంకోర్టు పరిపాలన విభాగాన్ని ఆదేశించినట్లు తెలిపారు.
‘‘ఈ ఉదయమే అధికారులకు సమాచారం ఇచ్చాను. వారు మెట్రో అధికారులతో చర్చిస్తున్నారు. ఇది ఒక సాధ్యమైన పరిష్కారంగా పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం వరకు సమస్య పరిష్కారమైతే మంచిదే. లేకపోతే నా జోక్యం అవసరమైతే నేను తప్పకుండా జోక్యం చేసుకుంటాను.’’ అని సీజేఐ సూర్యకాంత్ తెలిపారు.
దేశ రాజధానిలో కొనసాగుతున్న విద్యార్థుల నిరసనల నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) భద్రతా కారణాల దృష్ట్యా సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్‌తో పాటు మొత్తం 16 మెట్రో స్టేషన్లను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Asaduddin Owaisi : రేవంత్ రెడ్డి పాలనలోనే అభివృద్ధి.. కాంగ్రెస్‌కు కాదు, రేవంత్‌కే నా సపోర్ట్
-
Tamil Nadu: విడాకుల సందర్భంగా భార్య ‘కుక్క’తో పోలిక.. ధర్మాసనం తీరుపై విమర్శలు
-
Mohsin Naqvi: ‘భారత్ పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడిపోలేదా..? పాకిస్థాన్‌పై మీ విమర్శలు ఎందుకు..’?
-
Chinna Reddy : పదవి పోయినా గౌరవం ఉంది.. చిన్నారెడ్డి కీలక వ్యాఖ్యలు
-
US Politics: ఆర్ఎస్ఎస్ విరాళాలు తీసుకోం.. భగవత్ పర్యటన తర్వాత, 90 మంది అమెరికన్ నేతల ప్రతిజ్ఞ..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!