Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవల నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంపై స్పందిస్తూ, నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పేపర్ లీక్ అనేది చాలా తీవ్రమైన అంశమని, మెరుగైన విద్యావ్యవస్థ కోసం విద్యార్థులంతా కలిసికట్టుగా ముందుకు రావడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. విద్యార్థులు చేపట్టిన ఈ శాంతియుత నిరసనను అభినందిస్తూ, దీనికి ఎలాంటి రాజకీయ రంగు పులమకూడదని, ప్రభుత్వం తప్పకుండా విద్యార్థులకు అండగా నిలుస్తుందనే నమ్మకం తనకు ఉందని సల్మాన్ రాసుకొచ్చారు. నిరసనల సమయంలో గాయపడిన విద్యార్థుల పట్ల ఆయన సానుభూతి వ్యక్తం చేశారు.
అయితే సల్మాన్ ఖాన్ ఈ పోస్ట్ చేసిన వెంటనే, ఆయనకు సంబంధించిన ఓ పాత వీడియో ఇంటర్నెట్లో విపరీతంగా ట్రెండ్ అవ్వడం ప్రారంభమైంది. 2020లో ‘ది కపిల్ శర్మ షో’లో సల్మాన్ తండ్రి, ప్రముఖ రచయిత సలీమ్ ఖాన్ తన కొడుకుల స్కూల్ రోజుల నాటి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. తమ ఇంటికి ‘గణేష్’ అనే వ్యక్తి వచ్చేవాడని, కుటుంబ సభ్యులంతా అతనికి తనకంటే ఎక్కువ గౌరవమర్యాదలు ఇస్తూ టీ, కుర్చీలు ఏర్పాటు చేసేవారని సలీమ్ ఖాన్ తెలిపారు. అసలు ఆ గణేష్ ఎవరని ఆరా తీస్తే.. పరీక్షల పేపర్లు లీక్ చేసి సల్మాన్, అతని సోదరులకు తెచ్చి ఇచ్చే వ్యక్తి అని తెలిసిందని నవ్వుతూ చెప్పారు. ఈ విషయం చెబుతున్నప్పుడు పక్కనే ఉన్న సల్మాన్, అర్బాజ్, సొహైల్ నవ్వులు చిందించగా, ఆ పేపర్ లీక్ నిజానికి తన కోసమేనని సల్మాన్ సరదాగా అంగీకరించారు.
Also Read
- Indravati Tiger Reserve: ఛత్తీస్‌గఢ్‌లో అద్భుతం.. నాలుగు దశాబ్దాల తర్వాత టూరిస్టులకు ఇంద్రావతి అడవులు స్వాగతం..
- Robbery: ఆన్లైన్లో తాళాలు పగలగొట్టడం నేర్చుకుంది.. రూ.70 లక్షలు కాజేసింది..
- BJP: రామ్‌లీలా మైదాన్‌లో గుండాల జాతర.. కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్..
- Ind Vs NZ 5th T20: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. టీమిండియా జట్టులోకి కీలక ప్లేయర్లు ఎంట్రీ..
ఈ పాత వీడియో బయటకు రావడంతో నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు పేపర్ లీక్‌పై జోకులు వేసి, ఇప్పుడు నీట్ నిరసనలకు మద్దతుగా మాట్లాడటం సెలబ్రిటీల నైతికత లేనితనానికి (హిపోక్రసీకి) నిదర్శనమని కొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. భారత్‌లో పేపర్ లీక్ చేసి దానిపై కామెడీ కూడా చేయవచ్చంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం అది కేవలం చిన్నతనంలో జరిగిన సరదా సంఘటన అని సల్మాన్‌ను సమర్థిస్తున్నారు.
Salman Khan today: "Paper leak is a very serious issue"
Salim Khan on Kapil's show: "Ganesh naam ke ladke ki sabse zyada izzat thi hamare ghar mein, kyoki PAPER LEAK hote the to woh Salman ko laake deta tha" 😭😭😭 https://t.co/yeXlInPJce pic.twitter.com/GubGJQid5j
— Raj (@idfcwau) July 22, 2026
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. శరవేగంగా పోలింగ్ ప్రక్రియ!
-
IQOO Z11x 5G: 7200mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్ప్లేతో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Indravati Tiger Reserve: ఛత్తీస్‌గఢ్‌లో అద్భుతం.. నాలుగు దశాబ్దాల తర్వాత టూరిస్టులకు ఇంద్రావతి అడవులు స్వాగతం..
-
Robbery: ఆన్లైన్లో తాళాలు పగలగొట్టడం నేర్చుకుంది.. రూ.70 లక్షలు కాజేసింది..
-
BJP: రామ్‌లీలా మైదాన్‌లో గుండాల జాతర.. కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్..
-
Ind Vs NZ 5th T20: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. టీమిండియా జట్టులోకి కీలక ప్లేయర్లు ఎంట్రీ..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!