Crime News: ప్రపంచంలో క్రైమ్ రేటు పెరిగిపోతోంది. క్రైమ్ జరిగింది అంటే దానికి కారణాలు రెండే రెండు. ఒకటి డబ్బు, రెండు వివాహిత సంబంధం. ఈ మధ్యకాలంలో రెండోది మరీ విపరీతంగా జరుగుతోంది. పెళ్లి అయ్యి కాపురం చేసుకుంటున్న వారు వేరేవారిపై మోజు పడి కుటుంబాలను గాలికి వదిలేస్తున్నారు. ఇక ఇదొకరకమైతే.. తమ సంబంధానికి అడ్డొచ్చినవారిని అతి కిరాతంగా చంపడానికి కూడా వెనకాడడం లేదు. అందులో యువకులు, నడి వయస్కులే కాదు వృద్దులు కూడా ఉన్నారు. అలాంటి కేసే ఇది. మెలుగురు వృద్దులు ఒక మహిళ మోజులో పడి మరో వ్యక్తిని దారుణంగా చంపి అడ్డంగా బుక్కయ్యారు. ఈ దారుణ ఘటన బీహార్ లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. నలందా జిల్లాలోని ఒక గ్రామంలో పిను దేవీ అనే 30 ఏళ్ళ మహిళా వితంతువు టీ కొట్టు పెట్టుకొని జీవిస్తోంది. కొన్నేళ్ల క్రితం ఆ టీ కొట్టు వద్ద ఆమెకు కృష్ణనందన్ ప్రసాద్ (75) సూర్యమణి కుమార్ (60) వాసుదేవ్ పాశ్వాన్ (63) లోహా సింగ్ (62) అనే వృద్దులు పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. వృద్దులు నలుగురు కలిసి ఆమెతో శృంగారంలో పాల్గొనేవారు. అది కూడా ఎలా అంటే ఒక్కొక్కసారి ఒకొక్కరు కాకుండా నముగూరు ఒకేసారి ఆమెతో రాసలీలలు సాగించేవారు. కొన్నిరోజులు అంతా బాగానే నడించింది. ఆ తరువాత ఆమెపైన తృపిత్ శర్మ అనే మరో వృద్ధుడు కన్నేశాడు. ఆమె కూడా కాదనకుండా ఐదోవాడితో కూడా శృంగారంలో పాల్గొంది. కానీ, వారిద్దరూ కలిసి ఉండడం మిగతా నలుగురికి ఇష్టం లేదు. ఈ విషయమై నలుగురు ప్రియులు, ఐదో వాడితో గొడవపడ్డారు. మహిళ వద్దకు వచ్చిన తృపిత్ శర్మ.. ఇక నుంచి తనతో మాత్రమే ఉండాలని, ఆ నలుగురితో కనిపిస్తే మీ బండారం బయటపెడతాను అని బెదిరించాడు. ఇక ఎక్కడ వారు బయటపడతారో అని మహిళ, నలుగురు ప్రియులు కలిసి తృపిత్ ను హత్య చేయాలనీ నిర్ణయించుకున్నారు. శృంగారానికి అని పిలిచి అతడిని రాళ్లతో కొట్టి చంపి టాయిలెట్ ట్యాంక్ లో పడేశారు. ఇక వారం రోజులు అవుతున్నా తండ్రి ఇంటికి రాకపోవడంతో తృపిత్ కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. ఫోన్ కాల్స్ ఆధారంగా ఐదుగురు నిందితులను పట్టుకున్నామని పోలీసులు తెలిపారు.