అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. న్యూఇయర్ వేడుకల్లో దుండగులు కాల్పుడు జరిపారు. న్యూఇయర్ వేడుకలకు వచ్చిన దుండగులు వేడుకలను మొదలైన కాసేపటికి కాల్పులు జరిపారు. ఒక్కసారి తుపాకీ పేలిన శబ్దం వినడంతో వేడుకల్లో ఉన్న జనం పరుగులు పెట్టారు. అమెరికాలోని మిసిసిపీ గల్ఫ్‌పోర్ట్‌లో నిర్వహించిన నూతన సంవత్సరం వేడుకల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగుల కాల్పుల్లో మగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అంతేకాకుండా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.…