తెలంగాణ సీఐడీ చీఫ్ గోవింద్‌సింగ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.. రాజస్థాన్‌లో ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది.. ఈ ప్రమాదంలో గోవింద్‌సింగ్ భార్య అక్కడిక్కడే మృతిచెందగా.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు గోవింద్‌సింగ్.. ఇక, వారితో పాటు కారులో ప్రయాణం చేస్తున్న డ్రైవర్, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.. గోవింద్ సింగ్‌కు తీవ్రమైన ఫ్రాక్చర్‌తో ప్రాణాలతో బయటపడగా.. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది… జైసల్మేర్ జిల్లాలోని రామ్‌గఢ్-టానోట్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది..
Read Also: MBBS and BDS: ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
సమాచారం ప్రకారం, తెలంగాణ సీఐడీ డీజీ, ఐపీఎస్ గోవింద్ సింగ్ తన భార్యతో కలిసి మాతేశ్వరి తనోతరాయ్ మాత ఆలయాన్ని సందర్శించడానికి వెళ్లారు.. ఈ క్రమంలో రామ్‌గఢ్ ప్రాంతంలో ఉన్న ఘంటియాలీ మాత ఆలయం సమీపంలో ఆయన కారు ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న డీజీ గోవింద్ సింగ్ భార్య షీలా సింగ్.. ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు.. అయితే డీజీ గోవింద్ సింగ్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి.. ప్రథమ చికిత్స అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జవహర్ ఆస్పత్రికి చేరి చికిత్స పొందుతున్నారు.. ఇక, ఘటన గురించి సమాచారం అందుకున్న బీఎస్ఎఫ్.. తమ అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని జవహర్ ఆసుపత్రికి తరలించారు. ఈరోజు ఉదయం సుమారు 9.10 గంటలకు, గోవింద్ సింగ్, ఆయన భార్య.. ఆలయాన్ని సందర్శించిన తర్వాత సుమారు 2.45 గంటలకు తిరిగి ప్రయాణం అయిన సమయంలో ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు.