TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి
- టీసీఎస్ నాసిక్ కేసులో సంచలన విషయాలు..
- తాను ఎదుర్కొన్న వేధింపుల్ని బయటపెట్టిన మహిళా ఉద్యోగి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ కేసులో నిందితుల అరాచకాలు నెమ్మదిగా వెలుగులోకి వస్తున్నాయి. ఎలా మహిళల్ని వేధించారు, మతమార్పిడులకు పాల్పడ్డారనే విషయాలపై బాధితులు పోలీసులకు చెబుతున్నారు. తాజాగా, ఒక సీనియర్ మహిళా ఉద్యోగి నిందితుల ప్రవర్తనపై ఆరోపణలు చేశారు. తాను ఎదుర్కొన్న వేధింపులపై సంస్థ చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. తనకు గర్భస్రావం అయిందని తెలిసి, జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసినట్లు వెల్లడించింది.
గత 11 ఏళ్లుగా ఆ సంస్థలో పనిచేస్తున్నట్లు బాధిత మహిళ చెప్పుకొచ్చింది. 2026 ఫిబ్రవరిలో నిందితుడు తౌసిఫ్ అత్తర్ తన వద్దకు వచ్చి తన ఆరోగ్యం గురించి అడిగాడని, ఇటీవల గర్భస్రావం కావడంతో అనారోగ్యంతో ఉన్నట్లు చెప్పానని మహిళ చెప్పింది. బిడ్డలు కలగాలంటే అజ్మీర్‌లోని ఒక మౌల్వీ వద్దకు వెళ్లాలని సూచించినట్లు, తన వ్యక్తిగత విషయాలపై వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపించింది. ఆ వ్యాక్యల్ని అవమానకరమైన, అనుచితమైన వ్యాఖ్యలుగా ఆమె అభివర్ణించింది.
Also Read
- Kerala Road A*ccident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు, 8 మంది మృతి
- Bareilly Viral Video: బురఖాలో ప్రియుడితో పట్టుబడిన భార్య.. నడిరోడ్డుపై భర్త వీరంగం..
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
Read Also: USA: డాలర్ కలలు కల్లలు.. అమెరికా నుంచి వెళ్లిపోవాలనుకుంటున్న భారతీయులు..
అత్తర్ తన వైవాహిత జీవితం, సంతానం లేకపోవడంపై పదే పదే వ్యాఖ్యలు చేసి, మానసికంగా వేధించినట్లు చెప్పింది. నిందితులైన డానిష్ షేక్, తౌసిఫ్, రజా మెమన్, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి,ఆసిఫ్ అన్సారీ తనకు వ్యక్తిగతంగా తెలుసని, వారు తనలో అనుచితంగా ప్రవర్తించినట్లు చెప్పింది. ఈ నిందితులు హిందూ ఉద్యోగుల్ని టార్గెట్ చేసేవారిని ఆరోపించింది. మత విశ్వాసాలు, విగ్రహాలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం, మహిళా ఉద్యోగులను లైంగికంగా రెచ్చగొట్టే రీతిలో వ్యాఖ్యలు చేసే వారని చెప్పింది. పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సంస్థ చర్యలు తీసుకోలేదని ఆరోపించింది.
2022లో షఫీ షేక్ అనే నిందితులు తన ఛాతి వైపు తదేకంగా చూస్తూ, అనుచితంగా నవ్విన ఘటనను గుర్తు చేసుకుంది. ఆ చూపులు భరించలేక బయటకు గదిలో నుంచి బయటకు వెళ్లినట్లు బాధితురాలు చెప్పింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో 9 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
Mirzapur The Movie Box Office: జన్మాష్టమి రోజున ‘మీర్జాపూర్’ కి డబ్బుల వర్షం.. మొదటి రోజు ఎంత రాబట్టిందో తెలిస్తే..
-
KTR: ‘జాబులు లేవు.. జవాబులు లేవు’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
-
Pretorius Breaks T20 Record: వైభవ్ సూర్యవంశీ సహచరుడి చరిత్రాత్మక శతకం.. అరుదైన రికార్డు సొంతం
-
Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
-
Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!