Mahadev Betting App: మహదేవ్ బెట్టింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. దుబాయ్‌లో రవి ఉప్పల్ అరెస్ట్..! తెరపైకి రాజకీయ నేతలు, అధికారుల లీలలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahadev Betting App : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్’ కేసులో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. వేల కోట్ల హవాలా నెట్‌వర్క్‌ను నడిపిస్తూ దర్యాప్తు సంస్థల కళ్లుగప్పి తిరుగుతున్న యాప్ సహ-వ్యవస్థాపకుడు రవి ఉప్పల్‌ను దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు భారత భద్రతా వర్గాలకు సమాచారం అందింది. మరో కీలక సూత్రధారి సౌరభ్ చంద్రకర్‌ను ఒమన్ నుంచి రప్పించే ప్రక్రియ సాగుతుండగానే, రవి ఉప్పల్ చిక్కడం కేసు విచారణలో కీలక మైలురాయిగా మారింది.
ఈ వ్యవహారంలో అత్యంత దిగ్భ్రాంతికరమైన అంశం బెట్టింగ్ మాఫియా, రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారుల మధ్య సాగిన లోతైన బంధం. ఛత్తీస్‌గఢ్ కేంద్రంగా ప్రారంభమైన ఈ దందా ఇంత భారీ స్థాయికి చేరడం వెనుక అధికార యంత్రాంగం, పలువురు ప్రముఖ ప్రజాప్రతినిధుల ప్రత్యక్ష, పరోక్ష సహకారం ఉన్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రాథమిక దర్యాప్తులోనే గుర్తించింది. దశాబ్దాల పాటు చట్టవిరుద్ధ బెట్టింగ్ కార్యకలాపాలు నిరాటంకంగా సాగడానికి రాష్ట్రానికి చెందిన కొందరు కీలక రాజకీయ నేతలు రాజకీయ రక్షణ కల్పించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. యాప్ కార్యకలాపాలు బయటకు పొక్కకుండా, పోలీసు దాడులు జరగకుండా ఉండేందుకు గాను ఉన్నతాధికారులు, పోలీసు వర్గాలకు ప్రతి నెలా భారీ ఎత్తున ముడుపులు అందినట్లు తేలింది. సౌరభ్ చంద్రకర్ ప్రచారం, సాంకేతిక వ్యవహారాలను చూస్తే.. రవి ఉప్పల్ రాజకీయ నాయకులు, అధికారుల ‘సెటిల్మెంట్లు’, హవాలా ద్వారా కమీషన్లు చేరవేసే కీలక నెట్‌వర్క్‌ను పర్యవేక్షించినట్లు దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది.
Also Read
- AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. పోలింగ్ బూత్ దగ్గర పెట్రోల్ బాంబులు!
- Nissan Festive Offers: కార్లపై బంపర్ ఆఫర్.. రూ.86 వేల విలువైన CNG కిట్ ఫ్రీ.. అప్పటి వరకు మాత్రమే..!
- కొత్త లుక్‌లో Volkswagen Virtus Facelift.. లాంచ్‌కు సిద్ధం..!
- How To Make Diya Without Oil: దీపావళికి ఖరీదైన దీపాలు వద్దు.. ఇంట్లోనే వాటర్ క్యాండిల్స్ తయారు చేయండిలా..
ఈడీ అంచనాల ప్రకారం మహదేవ్ బెట్టింగ్ యాప్ మరియు దాని అనుబంధ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఏకంగా రూ. 94,000 కోట్ల మేర లావాదేవీలు సాగాయి. ఇందులో ప్రమోటర్ల జేబుల్లోకి సుమారు రూ. 4,000 కోట్ల నుంచి రూ. 5,000 కోట్లు చేరినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. లాభాల్లోని సింహభాగం హవాలా మార్గాల్లో విదేశాలకు తరలిపోగా, మరో ప్రధాన వాటా తమను కాపాడుతున్న నేతలు, అధికారుల చేతుల్లోకి చేరినట్లు తెలుస్తోంది.
2023 అక్టోబర్‌లో జారీ అయిన ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా దుబాయ్‌లో ఉప్పల్‌ను అదుపులోకి తీసుకున్నప్పటికీ, యూఏఈ ప్రభుత్వ వర్గాల నుంచి భారత విదేశాంగ శాఖకు ఇంకా పూర్తి స్థాయి అధికారిక లేఖ అందాల్సి ఉంది. ప్రస్తుతం రాయబార మార్గాల ద్వారా రవి ఉప్పల్‌ను భారత్‌కు రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు వేగంగా పావులు కదుపుతున్నాయి.
రవి ఉప్పల్‌ను భారత్‌కు తీసుకొచ్చి విచారిస్తే.. ఈ మహా కుంభకోణంలో ఎవరెవరికి ఎన్ని కోట్లు ముట్టాయి? ఏయే రాజకీయ నాయకులు ఎన్నికల కోసం లేదా వ్యక్తిగత ఆస్తుల కోసం ఈ సొమ్మును వాడారు? తెరవెనుక చక్రం తిప్పిన బ్యూరోక్రాట్లు ఎవరు? అనే పేర్లు అధికారికంగా బయటపడే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే పలువురు బడా నేతలు, ఉన్నతాధికారుల్లో తీవ్ర గుబులు మొదలైంది.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. పోలింగ్ బూత్ దగ్గర పెట్రోల్ బాంబులు!
-
Mahadev Betting App: మహదేవ్ బెట్టింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. దుబాయ్‌లో రవి ఉప్పల్ అరెస్ట్..! తెరపైకి రాజకీయ నేతలు, అధికారుల లీలలు
-
Nissan Festive Offers: కార్లపై బంపర్ ఆఫర్.. రూ.86 వేల విలువైన CNG కిట్ ఫ్రీ.. అప్పటి వరకు మాత్రమే..!
-
కొత్త లుక్‌లో Volkswagen Virtus Facelift.. లాంచ్‌కు సిద్ధం..!
-
How To Make Diya Without Oil: దీపావళికి ఖరీదైన దీపాలు వద్దు.. ఇంట్లోనే వాటర్ క్యాండిల్స్ తయారు చేయండిలా..
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 711 కి.మీ ప్రయాణం.. Mercedes-Benz కొత్త ఎలక్ట్రిక్ SUV లాంచ్..!
-
WBBL 2026: కీపర్ ‘నో బాల్’ బ్లండర్.. పొరపాటుతో తారుమారైన మ్యాచ్ రిజల్ట్.. రెనెగేడ్స్‌ను వరించిన అదృష్టం.!
-
గేమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. డిసెంబర్ 10న BGMI Air విడుదల.. 1.4 కోట్ల రిజిస్ట్రేషన్లతో రికార్డు..!
-
Jio Unlimited 5G Data: జియో బంపర్ ఆఫర్.. రూ.15 రీఛార్జ్‌తో రోజంతా అపరిమిత 5G ఇంటర్నెట్.!
-
WPL 2027 Schedule: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. WPL 2027 షెడ్యూల్ విడుదల.. మ్యాచ్‌ల తేదీలు, వేదికల వివరాలివే..!