USA: డాలర్ కలలు కల్లలు.. అమెరికా నుంచి వెళ్లిపోవాలనుకుంటున్న భారతీయులు..
- కల్లలవుతున్న అమెరికా కలలు..
- యూఎస్ నుంచి రావాలనుకుంటున్న భారతీయలు..
- జీవన వ్యయం, రాజకీయాలే కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USA: అమెరికా అనేది చాలా మంది భారతీయుల కల. డాలర్ డ్రీమ్స్, మెరుగైన జీవన విధానం, డాలర్లలో సంపాదన ఉంటుందని ప్రతీ ఒక్కరు యూఎస్ వెళ్లాలని అనుకుంటారు. అక్కడే స్థిరపడాలని కోరుకుంటారు. ఎన్ఆర్ఐ అంటేనే మన దేశంలో ,ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక గౌరవంగా చూస్తారు. ఇక తల్లిదండ్రులు ఎన్‌ఆర్ఐ సంబంధాలు అంటే కోట్ల రూపాయలు వరకట్నంగా ఇచ్చుకుని తమ కూతుళ్లను కట్టబెడుతారు. అయితే, ఇదంతా గతం కాబోతోంది. అమెరికాలో నివసిస్తున్న చాలా మంది భారతీయలు ఇప్పుడు స్వదేశం లేదా వేరే ఇతర దేశాలకు మకాం మార్చాలని అనుకుంటున్నారు.
Read Also: Darling Re-release: రీ-రిలీజ్‌లో ‘డార్లింగ్’ విధ్వంసం.. మైండ్ బ్లాకింగ్ కలెక్షన్స్!
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
కార్నెగీ ఎండోమెంట్, యూగోవ్‌తో కలిసి నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, అమెరికాలోని భారతీయ సమాజం తీవ్ర ఆందోళనలో ఉందని చెప్పింది. సుమారు 40 శాతం మంది అమెరికాను విడిచివెళ్లిపోవాలని ఆలోచిస్తున్నట్లు తేలింది. ఈ సర్వేలో 1000 మందిని ప్రశ్నించగా.. 14 శాతం మంది తరుచుగా, 26 శాతం మంది అప్పుడప్పుడు యూఎస్ విడిచి వెళ్లిపోవాలని ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. 58 శాతం మంది అమెరికాలోని రాజకీయ పరిస్థితులే కారణమని వెల్లడించగా, 54 శాతం మంది జీవనవ్యయం, 41 శాతం మంది వ్యక్తిగత భద్రత ప్రధాన కారణమని చెప్పారు. ప్రస్తుతం అమెరికాలో 5.2 మిలియన్ల మంది భారతీయ మూలాలు ఉన్న ప్రజలు నివసిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై భారత సమాజం తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సర్వేలో తేలింది. ఆయన ఆర్థిక విధానం, వలస విధానం, అంతర్జాతీయ సంబంధాల నిర్వహణపై 71 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా అమెరికన్ల కోసమే అనే ట్రంప్ నినాదం వలసదారుల్లో భయాలను పెంచుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికాలో జీవన వ్యయం పెరగడం ప్రధాన కారణమని మరికొంత మంది చెబుతున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కో, సియాటెల్, న్యూయార్క్ వంటి నగరాల్లో అద్దెలు 3000-5000 డాలర్ల వరకు ఉన్నాయని, పిల్లల్ని పెంచడానికి 3 లక్షల డాలర్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే కాకుండా గ్రీన్ కార్డులు ఆలస్యం కావడం, వీసా బ్యాక్‌లాగ్స్, ఫారిన్ పాలసీ అనిశ్చితి వంటి సమస్యలు భారతీయ సమాజంలో ఆందోళనల్ని పెంచుతోంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!