Meerpet Horror: కసాయి అల్లుడు.. కత్తులతో మారణహోమం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుటుంబ కలహాలు పెను విషాదానికి దారితీశాయి. క్షణికావేశంలో మానవత్వాన్ని మరిచిన ఓ అల్లుడు కసాయిగా మారి సొంత బంధువులపైనే కత్తులతో విరుచుకుపడ్డాడు. అడ్డువచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా నరికిచంపాడు. హైదరాబాద్ నగర శివారులోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ దారుణ మారణకాండ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
రక్తసిక్తమైన జయశ్రీ కాలనీ
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్పేట్ పీఎస్ పరిధిలోని జయశ్రీ కాలనీలో నివాసముంటున్న కుటుంబంలో గత కొంతకాలంగా అంతర్గత కలహాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం సదరు అల్లుడు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ ఇంట్లోకి ప్రవేశించాడు. వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో కుటుంబసభ్యులపై ఒక్కసారిగా విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అత్త నిరంజన్ బీ, బావమరిది భార్య రేష్మపై తీవ్రస్థాయిలో కత్తిపోట్లు పొడవడంతో వారు రక్తపు మడుగులో
అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
Also Read
- Basara IIIT Student S*uicide: బాసర ట్రిపుల్ విద్యార్థి ఆత్మ*హత్యకు అసలు కారణం ఇదే.. కీలక విషయాలు వెల్లడి..!
- Delhi Gang Rape Case: ఢిల్లీలో యువతిపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు అరెస్టు
- Tragedy: స్కూల్ బస్సును ఢీకొన్న లారీ.. నలుగురు చిన్నారులు మృతి, 35 మందికి గాయాలు!
- Madhya Pradesh: ఆస్తి కోసం అమానుషం.. 80 ఏళ్ల తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు!
ఈ దాడిలో నిందితుడి భార్య, కుమార్తె సహా బావమరిది యూసుఫ్ తీవ్రంగా గాయపడ్డారు. యూసుఫ్ పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో స్థానికులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు.
ఉదయమే పీఎస్‌కు వెళ్లినా దక్కని రక్షణ.. పోలీసుల నిర్లక్ష్యంపై నిప్పులు!
ఈ దారుణ ఘటనకు పోలీసుల అలసత్వమే కారణమంటూ మృతుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడి నుంచి తమకు ప్రాణహాని ఉందని, గొడవ తీవ్రమవుతోందని బాధితులు బుధవారం ఉదయమే మీర్పేట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ పోలీసులు సకాలంలో స్పందించలేదని, కనీస రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే నిందితుడు ఇంతటి దారుణానికి ఒడిగట్టాడని బాధితుల కుటుంబసభ్యులు రోదిస్తూ ఆరోపించారు.
ఘటనా స్థలంలో సీపీ, క్లూస్ టీమ్
సమాచారం అందుకున్న వెంటనే మీర్పేట్ పోలీసులు, ఉన్నతాధికారులు క్లూస్ టీమ్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. వేలిముద్రలు, రక్తపు నమూనాలు సేకరించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు. ప్రశాంతంగా ఉండే జయశ్రీ కాలనీలో ఒక్కసారిగా ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం, మరొకరు విషమ స్థితికి చేరడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
తాజావార్తలు
-
Khelo India 2026: ఖేలో ఇండియా-2026 ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. బ్రోచర్ విడుదల
-
Poojitha Ponnada: AK47లో ఫుల్ లెంగ్త్ రోల్ అని పిలిచి.. సైలెంట్‌గా వేరే హీరోయిన్ను పెట్టేశారు!
-
Tollywood: మన దర్శకులకు ఏమైంది?
-
Imran: ‘మేము బిచ్చగాళ్లం కాదు’.. ఎస్పీ సీట్ల ప్రకటనపై భగ్గుమన్న కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్..
-
Vaibhav Sooryavanshi: 50 బంతుల్లో డబుల్ సెంచరీ చేయొద్దు ప్లీజ్.. న్యూజిలాండ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!