Murder Case : డబ్బు కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారు. నమ్మకం, స్నేహం.. డబ్బు ముందు తేలిపోతున్నాయి. కోన్నేళ్లుగా కార్ డ్రైవింగ్‌కు వస్తున్న వ్యక్తి బంగారం వ్యాపారిని హత్య చేశాడు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో పార్వతీశం గుప్తా మర్డర్ వెనుక కోట్ల రూపాయలు బంగారం కోట్టేయాలన్న ఆలోచనతో కేటుగాళ్లు ఇంతటి ఘాతకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన గోల్డ్ వ్యాపారి పోట్నూరు వెంకట పార్వతీశం గుప్తాను దారుణంగా హత్య చేశారు. వినాయక చవితి ముందు రోజు గోల్డ్ ఖరీదు చేసేందుకు విశాఖ వెళ్లిన గుప్తా.. చాలా రోజుల వరకు తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కొద్ది రోజుల తర్వాత ఈ కేసును పోలీసులు ఛేదించారు…
బంగారం ఖరీదు చేయడం కోసం పెద్ద మొత్తంలో డబ్బు తీసుకు వెళ్లడం.. గోల్డ్ తీసుకుని రావడం.. వ్యాపారులకు ఇచ్చి కమీషన్ తీసుకోవడంక పార్వతీశం గుప్తా వృత్తిగా ఉంది. ఇటీవల అదే పనిలో తాను వెళ్లి సమయంలో.. తనతోపాటే ఉన్న కారు డ్రైవర్ అతన్ని దారుణంగా హత్య చేశాడు.
Read Also : Nag Ashwin : ప్రధాని మోడీకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ సూచన.. అలా చేయాలంట
పార్వతీశం గుప్తా హత్య కేసులో పోలీసులు.. కారు డ్రైవర్‌ను అనుమానించారు. డ్రైవర్ సంతోష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. శ్రీకాకుళంలోని మారుతీ షోరూం సమీపంలో కార్ డెకార్స్ షాపు నిర్వహిస్తున్న ఆతడి స్నేహితుడు రాజు పేరు బయటకు వచ్చింది. వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగారం కోసం ఆతడిని వారు హత్య చేసినట్లుగా తెలుస్తొంది. మృతదేహాన్ని శ్రీకాకుళం రూరల్ మండం ప్రాంతంలోని పాత్రునివలస రోడ్డులో ఉన్న గెడ్డలో పడేశారు. పోలీసులు అదుపులో ఉన్న వ్యక్తులను విచారించగా ఇచ్చిన సమాచారం మేరకు టెక్కలి డిఎస్పీ లక్ష్మణరావు ఆద్వర్యంలో నరసన్నపేట, శ్రీకాకుళం రూరల్ పోలీసులు గెడ్డలో గాలింపు చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బందిని రప్పించి పాత్రునివలస రోడ్డులో ఉన్న గెడ్డ ప్రవాహంలో మృతదేహం కోసం గాలించగా చివరికి పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. పార్వతీశం గుప్తా మృతదేహాన్ని ఒడ్డుకు తీశారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గుర్తించారు. గుప్తా మృతదేహాన్ని పోలీసులు పోస్టు మార్టం కోసం శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. బంగారం వ్యాపారి పార్వతీశం గుప్తా హత్య ఘటనపై పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు ముమ్మరం చేసారు.
ఈ కేసులో కారు డ్రైవర్ సంతోష్ కీలకంగా ఉన్నాడు. పార్వతీశం హత్య తర్వాత అతడు బంగారాన్ని తీసుకు వెళ్లాడు. అందులో కొంత బంగారాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బులతో టూర్ వెళ్లినట్లుగా చెబుతున్నారు. అటు శ్రీకాకుళంలో రాజుని కూడా పోలీసులు విచారించారు. ఇప్పటికే కొంత మేరకు బంగారాన్ని రికవరీ చేసినట్లుగా తెలుస్తొంది. ఈ కేసులో అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు..