Wedding Drama: ఓ నిత్య పెళ్లి కొడుకు బండారం బయటపడింది. రెండో పెళ్లికి సిద్ధమైన ప్రబుద్ధుడిపై మొదటి భార్య కంప్లెయింట్ ఇవ్వడంతో దెబ్బకు పెళ్లి వదిలి పెట్టి పారిపోయాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. నిత్య పెళ్లికొడుకును పట్టుకుని కఠినంగా శిక్షించాలని వధువు బంధువులు డిమాండ్ చేస్తున్నారు. దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన సత్యనారాయణకు గోపాలపురం మండలంలోని యువతితో వివాహం జరిపించాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. అందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఆ ఘడియలు…
Marriage Fraud: బెజవాడలో నిత్య పెళ్లి కూతురు అను ఆగడాలపై పోలీసులు విచారణ చేపట్టారు. నగరంలో పబ్స్ వేదికగా అక్కడకు వచ్చే వారిని టార్గెట్ చేసుకుని అను ఈ పెళ్లిళ్ల మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
ఒంటరిగా ఉన్న ఓ మహిళను నమ్మకంగా పెళ్లి చేసుకున్న ఓ ప్రబుద్ధుడు లాటరీ పేరుతో ఆమెకు టోకరా వేశాడు. రూ.15 కోట్లు పన్నులు చెల్లిస్తే రూ.1,700 కోట్లు వస్తాయని ఆశలు కల్పించాడు. చివరికి ఆమె ఆస్తులు అమ్మించి రూ.28 కోట్లు తీసుకుని పరారయ్యాడు. బాధితురాలు చిత్తూరు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఇక్కడ.. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు శివ ప్రసాద్ నాయుడు.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లో ఒక మహిళ పెళ్లి రోజు రాత్రి తన భర్తను చూసి ఆశ్చర్యపోయింది. తన భర్త నపుంసకుడు అని ఆరోపిస్తోంది. తన అత్తమామలు కట్నం కోసం నపుంసకుడితో తనకు వివాహం చేశారని ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని తన అత్తామామలకు చెబితే కొట్టి చంపడానికి ప్రయత్నించారని తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త, మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఓ నిత్య పెళ్లికొడుకు చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. తాను పోలీసు అధికారినని చెప్పుకుంటూ ఐదుసార్లు వివాహం చేసుకున్నాడు.
Marriage fraud: ప్రధానమంత్రి కార్యాలయంలో అధికారిని అని, ఎన్ఐఏ అధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతూ ఓ వ్యక్తి ఏకంగా ఆరు పెళ్లిళ్లు చేసుకున్నాడు. కాశ్మీర్ కుప్వారా జిల్లాకు చెందిన వ్యక్తి మారుపేర్లు, వేషధారణతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మహిళల్ని మోసం చేస్తూ.. ఆరుగురిని పెళ్లి చేసుకున్నాడు, దీంతో పాటు ఇతనికి పాకిస్తాన్‌లోని పలువురితో సంబంధాలు ఉన్నట్లు తేలింది.
Marriage Fraud: మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. ప్రతి జంట వారి మనస్సులో సంతోషకరమైన ప్రపంచం ఊహించుకుంటారు.