Cruel Father: కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే బిడ్డల పాలిట కాలయముడు అయ్యాడు. భార్యపై అనుమానంతో అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలను హతమార్చాడు. స్కూల్ నుంచి ఇంటికి తీసుకువచ్చి చిన్నారను కిరాతకంగా చంపేశాడు. తండ్రిని నమ్మి వేలుపట్టుకుని వచ్చిన చిన్నారులకు నరకయాతన చూపించి హతమార్చాడు. ఈ దారుణ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: Minister KTR: ఉచిత విద్యుత్ పై కాంగ్రెస్ ప్రకటన.. ఇవాళ, రేపు బీఆర్‌ఎస్ నిరసన
ఖమ్మం జిల్లా మధిర మండలం రాయపట్నంకు చెందిన పర్శపు శివరామ గోపాలరావు అదే గ్రామానికి చెందిన ఏసుమణిని పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు రామకృష్ణ, కుమార్తె ఆరాధ్య ఉన్నారు. రామకృష్ణ స్థానిక పాఠశాలలో మూడో తరగతి చదువుతుండగా.. ఆరాధ్య ఒకటవ తరగతి చదువుతోంది. అయితే గోపాలరావుకు భార్యపై అనుమానం పెరిగింది. ఈ క్రమంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. నెల రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో.. ఏసుమణి తన ఇద్దరు పిల్లలతో కలిసి అదే గ్రామంలోని తన ఇంటికి వెళ్లింది. చెడు వ్యసనాలకు బానిసైన గోపాలరావు చివరికి దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు గ్రామంలోని పాఠశాలకు వెళ్లిన గోపాలరావు తన ఇద్దరు పిల్లలను ఇంటికి తీసుకొచ్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వారిని దారుణంగా హత్య చేశాడు. ఇద్దరు పిల్లలను గొంతు నులిమి చంపాడు. ఆ తర్వాత పిల్లల మృతదేహాలను దుప్పటిలో చుట్టి ఇంటి నుంచి పారిపోయాడు. సాయంత్రం 5 గంటలైనా పిల్లలు పాఠశాల నుంచి ఇంటికి రాకపోవడంతో ఏసుమని ఆందోళనకు గురైంది.
Read also: UK: నర్స్ అక్రమ సంబంధం.. కారులో అది చేస్తుండగా రోగి మృతి.. ఆమె పరిస్థితి
పాఠశాలకు వెళ్లి విచారించగా.. సాయంత్రం 4 గంటలకు నాన్న తీసుకెళ్లారని చెప్పారు. దీంతో ఏసుమణి ఇంటికి వెళ్లి తలుపులు తెరిచి చూడగా పిల్లలు కనిపించలేదు. బీరువా పక్కన ఒక పొట్లం ఉండటంతో అనుమానంతో ఏసుమణి దానిని తెరిచింది. అక్కడ ఇద్దరు పిల్లలు పడి ఉండడం చూసి షాక్ తిన్నారు. వెంటనే స్థానికుల సహాయంతో పిల్లలను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లింది. అప్పటికే పిల్లలు చనిపోయారని అనడంతో తల్లి ఏసుమణి బోరున విలపించింది. ఆమె రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఏసుమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న గోపాలరావు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే పిల్లలను చంపేయడం స్థానికంగా కలకలం రేపింది. ఇంత దారుణానికి ఒడిగట్టిన గోపాలరావు అసలు వ్యక్తి కాదని, అతడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Extramarital Affair: ఇంటి యజమానురాలితో డ్రైవర్ ఎఫైర్.. ఫోన్ పెట్టిన చిచ్చుతో ఊహించని ట్విస్ట్