AP Crime: ఈఎంఐ చెల్లించలేదని సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి న్యూడ్ ఫొటోలు..! ట్విస్ట్ ఏంటంటే..?
- ఈఎంఐ డబ్బులు చెల్లించలేదంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి వేధింపులు..
- న్యూడ్ ఫొటోలు పంపించిన రికవరీ ఏజెంట్లు..
- పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు.. ఇద్దరి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: లోన్ యాప్‌ల వేధింపులు అంతా ఇంతా కాకుండా పోతున్నాయి.. లోన్ తీసుకోవాలంటూ వేధింపులు ఓవైపు.. మరోసారి లోన్ తీసుకున్న తర్వాత కట్టడం లేదంటూ మరో రకమైన టార్చర్.. ఆ లోన్ యాప్‌ల వేధింపులతో ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు విడిచారు.. మరెంతో మంది వేధింపులతో తీవ్రమైన మానసికక్షోభ అనుభవిస్తున్నారు.. అయితే, ఈఎంఐ డబ్బులు చెల్లించకపోవడంతో న్యూడ్ ఫొటోలు పంపించిన రికవరీ ఏజెంట్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఫిర్యాదు మేరకు ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు..
Read Also: Manmohan Singh: 2జీ స్కామ్ ఆరోపణలు ఉన్నా, అందుకే ఏ రాజాని మంత్రిగా కొనసాగించా..
Also Read
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్‌లోనే యువతి హత్య
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సూళ్లూరుపేటకు చెందిన యువతి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తూ ఆరు నెలల కిందట ఫినబుల్ యాప్‌లో లోన్ తీసుకుంది. ఈ క్రమంలో సమయానికి ఈఎంఐ చెల్లించకపోవడంతో ఆమె ఫొటోలను అసభ్యకరంగా మార్చి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తామని రికవరీ ఏజెంట్లు బెదిరింపులకు పాల్పడ్డారు. అంతేకాకుండా బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులకు ఫోన్ చేసి వేధించారు. లోన్ తాలూకూ డబ్బులు చెల్లించడం లేదంటూ దూషించారు. అంతటితో ఆగకుండా ఆమె సోదరుడికి మార్ఫింగ్ చేసిన కొన్ని న్యూడ్ ఫొటోలు కూడా పంపించడంతో యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఎంత వారించినా ఏజెంట్లు వినకపోవడం, బెదిరింపులు పెరుగుతుండడంతో ఏజెంట్ల వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించింది. దీంతో సకాలంలో స్పందించిన పోలీసులు.. ఇద్దరు ఏజెంట్లను అరెస్టు చేశారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల వద్ద రుణాలు తీసుకొనే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సుబ్బారాయుడు ఈ సందర్భంగా సూచించారు. ప్రజలు సైబర్ నేరాలు.. లోన్ యాప్ బెదిరింపులపై అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.. ఇక, యువతిని వేధించిన ఫినబుల్ లోన్ యాప్‌పై సైబర్ క్రైమ్ కేసు నమోదు చేశామని తెలిపారు ఎస్పీ సుబ్బారాయుడు..
తాజావార్తలు
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్‌లోనే యువతి హత్య
-
Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!