Srushti Ivf Center : ఆ ఆడవాళ్లు.. అమ్మతనాన్ని అంగట్లో పెట్టారు. అలాంటి వాళ్లను.. ఆడవాళ్లు అనేకంటే కిరాతకులని చెప్పవచ్చు. 18 మంది ఆడవాళ్లు కలిసి ఏకంగా ఒక ముఠాగా ఏర్పడ్డారు. అమ్మతనం కోసం వెంపర్లాడుతున్న మహిళలు టార్గెట్‌గా చేసుకొని నీచపు దందాకు తెగబడ్డారు. కోట్ల రూపాయలు సంపాదించారు. డాక్టర్ నమ్రత గ్యాంగ్‌లో మొత్తం 18 మంది సభ్యులు ఉన్నారు. తల్లితనం కోసం తల్లడిల్లుతున్న వారిని టార్గెట్ చేసుకుని.. IVF పేరుతో ఆ తర్వాత సరోగసీ పేరుతో…
Srishti Fertility Centre Surrogacy Scam: సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. సరోగసి పేరిట మోసాలకు పాల్పడుతున్న ఈ కేసులో 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్నటితో డాక్టర్ నమ్రత కస్టడీ విచారణ ముగిసింది. డాక్టర్ నమ్రత చెప్పిన వివరాలను పోలీసులు రికార్డు చేశారు. ఐదు రోజల పాటు విచారించిన పోలీసులు.. ఆమె నుంచి విషయాలను రాబట్టారు. ఇక ఈరోజు A3 కల్యాణి, A6 సంతోషిల కస్టడీ…
సృష్టి సరోగసి అక్రమాల కేసులో ఏ1గా ఉన్న ఉన్న డాక్టర్ నమ్రత 5 రోజుల కస్టడీ విచారణ ముగిసింది. గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ నమ్రతకు వైద్య పరీక్షల కోసం నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్ నుంచి తరలించారు. వైద్య పరీక్షలు అనంతరం సికింద్రాబాద్ కోర్టులో డాక్టర్ నమ్రతను హాజరు పర్చనున్నారు. కస్టడీలో భాగంగా పలు అంశాలపై డాక్టర్ నమ్రతాను పోలీసులు విచారించారు.
Srushti Case : సృష్టి కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత కస్టడీ నేడు ముగియనుంది. కోర్టు ఐదు రోజులపాటు పోలీసు కస్టడీకి అనుమతించగా, గత నాలుగు రోజుల విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కొకరుగా సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ బాధితులు బయటకు వస్తున్నారు. నల్గొండకు చెందిన జంట నుంచి రూ.44 లక్షలు, హైదరాబాద్‌కు చెందిన జంట నుంచి రూ.18 లక్షలు, మరో NRI జంట నుంచి రూ.25 లక్షలు వసూలు చేసినట్లు…
Srushti IVF: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న సృష్టి కేసులో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, తాజాగా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురూ మహిళలే కావడం కేసు దర్యాప్తులో కీలక మలుపుగా భావిస్తున్నారు. దర్యాప్తు వివరాల ప్రకారం, అరెస్టయిన ఈ ముగ్గురు మహిళలు తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రతకు ఏజెంట్లుగా వ్యవహరించినట్లు పోలీసులు వెల్లడించారు. శిశువుల క్రయ విక్రయాలలో వీరు నమ్రతకు నేరుగా సహకరించారు. ఈ సేవలకు…
Srushti Case : సృష్టి ఫెర్టిలిటీ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో గోపాలపురం పోలీసులు బుధవారం ఆమెను దాదాపు ఐదు గంటల పాటు విచారించారు. చైల్డ్ ట్రాఫికింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ విచారణ ముమ్మరంగా సాగింది. చైల్డ్ ట్రాఫికింగ్, సరోగసీ పేరుతో పిల్లల విక్రయాలు అనే తీవ్ర ఆరోపణలపై అడిగిన ప్రశ్నలకు డాక్టర్ నమ్రత తగిన సమాధానాలు ఇవ్వలేదు. చాలాసార్లు ఆమె నోరుమెదపక…
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో ఏ1 నిందితురాలు డాక్టర్ నమ్రత ను కస్టడీలోకి తీసుకున్నారు గోపాలపురం పోలీసులు. సికింద్రాబాద్ కోర్టు 5రోజుల కస్టడీకి అనుమతించింది. చంచల్ గూడా జైలు నుంచి ఏ1 నమ్రత ను కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారించనున్నారు. ఈనెల 5 వరకు డాక్టర్ నమ్రత పోలీస్ కస్టడీలోనే ఉండనుంది. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ విశాఖపట్నం మేనేజర్ కల్యాణి అచ్చయమ్మ వ్యవహారాలపై విచారించనున్నారు పోలీసులు. Also Read:Karnataka: నెల జీతం 15…
Hyderabad Surrogacy Racket: సృష్టిలో అక్రమాలు నిజమే అంటూ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత ఒప్పుకున్నారు.. చాలావరకు తెలిసే తప్పులు చేశామని పోలీసులకు స్పష్టం చేశారు. సరోగసి చేయకపోయినా చేసినట్లు దంపతులను నమ్మించి మోసం చేశామన్నారు. రాజస్థాన్ దంపతులను కూడా సరోగసి చేయకపోయినా చేసినట్లు నమ్మించామని.. డీఎన్ఏ పరీక్షల నివేదికలు కావాలని అడగడంతో విషయం బయటపడుతుందని తప్పించుకున్నామన్నారు.
Shocking Fertility Scam Uncovered: సంతాన సాఫల్యం అనే పవిత్రమైన పని చేస్తున్నామని బయటకు చెప్పుకుంటూ నీచపు దందా చేస్తున్నాయి కొన్ని సంస్థలు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ దందా వెలుగులోకి రావడంతో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థ చేస్తున్న గలీజ్ దందా బయటకు వచ్చింది. బిచ్చగాళ్లకు బిర్యానీ ఇచ్చి వీర్యం సేకరించినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. అంతే కాదు అడ్డా కూలీ మహిళల నుంచి అండాలు సేకరించినట్లుగా బయటపడింది.…
హైదరాబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై నమోదైన కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. గోపాలపురం పోలీసులు ఈనెల 25న ఈ కేసును నమోదు చేసినట్లు అధికారికంగా ధృవీకరించారు.