Kakinada Crime: కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి.. ఊరి చివర పొలాల మధ్య బావిలో అదే గ్రామానికి చెందిన సూరిబాబు, శ్రీను మృతదేహాలు గుర్తించారు స్థానికులు.. ఇద్దరినీ అదే గ్రామానికి చెందిన గంగాధర్ చంపి మృతదేహాలు బావిలో పడేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.. ఇద్దరు మృతులు, నిందితుడు గంగాధర్ సమీప బంధువులు అవుతారు.. మృతులు ఇద్దరి దగ్గర అప్పు తీసుకున్న గంగాధర్.. ఆ అప్పును తిరిగి చెల్లించకుండా ఉండేందుకు ప్లాన్ చేశారు.. ఆ ఇద్దరిని చంపేస్తే అప్పు తీర్చక్కర్లేదని.. అందుకే ఇద్దరని హత్య చేయాలని ప్రణాళిక రూపొందించాడు.. అందులో భాగంగా.. మందు పార్టీ ఇస్తానని చెప్పి ఇద్దరినీ పిలిచిన గంగాధర్.. వారికి ఫుల్ గా మద్యం పట్టించి.. ఆ తర్వాత చంపి.. మృతదేహాలను బావిలో పడవేశాడు..
Read Also: 12GB ర్యామ్, 6,000mAh బ్యాటరీ, IP64 రేటింగ్ లతో Redmi 15R 5G లాంచ్!
మరో వైపు, అదే గ్రామానికి చెందిన సూరిబాబును కూడా చంపి సుద్ధ గడ్డ వాగులో పడేయాలని ముందుగానే ప్లాన్ చేశాడట గంగాధర్.. అతని వ్యవహారంతో అనుమానం వచ్చిన సూరిబాబు.. పారిపోయాడు.. సూరిబాబు దగ్గర కూడా అప్పు తీసుకున్న గంగాధర్.. అతడికి అప్పును తిరిగి చెల్లించే ఉద్దేశం లేకపోవడంతో.. మర్డర్ ప్లాన్ చేశాడట.. కానీ, సూరిబాబు తప్పించుకున్నాడు.. ఇక, ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద మృతిపై విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.. అప్పు డబ్బులు ఎగ్గొట్టడం కోసమే.. సూరిబాబు, శ్రీనును గంగాధర్ హత్య చేసినట్టు ప్రాథమికంగా ఓ నిర్ధారణకు వచ్చారు.. తాడిపర్తి గ్రామానికి చెందిన మృతులు రంపం శ్రీను(48), తోలాటం సూరిబాబు (34) గా గుర్తించారు.. ఈ కేసులో రంపం గంగాధర అనే వ్యక్తిని అదుపులో తీసుకుని విచారణ చేపట్టడంలో ఈ కేసు మిస్టరీ వీడినట్టు అయ్యింది..