కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి.. ఊరి చివర పొలాల మధ్య బావిలో అదే గ్రామానికి చెందిన సూరిబాబు, శ్రీను మృతదేహాలు గుర్తించారు స్థానికులు.. ఇద్దరినీ అదే గ్రామానికి చెందిన గంగాధర్ చంపి మృతదేహాలు బావిలో పడేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు..