12GB ర్యామ్, 6,000mAh బ్యాటరీ, IP64 రేటింగ్ లతో Redmi 15R 5G లాంచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Redmi 15R 5G:రెడ్‌మీ 15R 5G హ్యాండ్‌సెట్‌ను చైనాలో లాంచ్ చేశారు. ఈ కొత్త ఫోన్ మొత్తంగా నాలుగు రంగుల ఎంపికలలో, అలాగే 5 వేర్వేరు ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 6,000mAh బ్యాటరీతో పాటు 33W ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇది ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో గరిష్టంగా 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ ఉన్నాయి. రెడ్‌మీ 15R 5G 6.9 అంగుళాల డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా ఇది దుమ్ము, నీటి నిరోధకత కోసం IP64 రేటింగ్‌ను కలిగి ఉంది.
Little Hearts : ఆ విషయంలో మౌళిని చూసి మిగతా హీరోలు నేర్చుకోవాల్సిందే..
Also Read
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- 144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- 10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
రెడ్‌మీ 15R 5G మొబైల్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2 ఇంటర్‌ఫేస్‌పై పనిచేస్తుంది. ఇందులో 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లే, 720×1,600 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, ఇంకా 810 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉన్నాయి. ఈ డిస్‌ప్లే బ్లూ లైట్ ఎమిషన్స్ కోసం TUV రైన్‌ల్యాండ్ ధృవీకరణ పొందింది. రెడ్‌మీ 15R 5G ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పాటు, 12GB LPDDR4X ర్యామ్, గరిష్టంగా 256GB UFS 2.2 స్టోరేజ్‌తో లభించనుంది.
ఈ హ్యాండ్‌సెట్‌లో 13MP వెనుక కెమెరా, సెల్ఫీలు, వీడియో కాలింగ్ ల కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. రెడ్‌మీ 15R 5G 6,000mAh బ్యాటరీతో పాటు 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 171.56×79.47×7.99mm కొలతలు ఉండగా.. 205గ్రాముల బరువు కలిగి ఉంది. రెడ్‌మీ 15R 5Gలో కనెక్టివిటీ ఎంపికలలో 5G, Wi-Fi 802.11 a/b/g/n/a, బ్లూటూత్ 5.4, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.
Lay off: గూగుల్ 200 మంది AI కాంట్రాక్టర్ల తొలగింపు
ఇక ధరల విషయానికి వస్తే.. రెడ్‌మీ 15R 5G 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 1,099 (రూ. 13,000)కాగా.. 6GB + 128GB CNY 1,599 (రూ. 19,000), 8GB + 128GB CNY 1,699 (రూ. 23,000), 8GB + 256GB CNY 1,899 (రూ. 25,000), 12GB + 256GB RAM CNY 2,299 (రూ. 28,000) ధరలతో లభ్యమవుతాయి. ఈ కొత్త ఫోన్ ప్రస్తుతం చైనాలో క్లౌడీ వైట్, లైమ్ గ్రీన్, షాడో బ్లాక్, ట్విలైట్ పర్పుల్ రంగులలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.
తాజావార్తలు
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
-
West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
-
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!