మసాజ్ పేరుతో తన స్నేహితురాల్ని హైదరాబాద్‌కు పిలిపించి, ఆమెను రొంపిలోకి దింపి, ఆపై చిత్రిహింసలకు గురి చేసిన ఓ యువతి బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లో నివాసముంటోన్న సంజనకు, ధిల్లీలో మసాజ్ థెరపిస్ట్ అయిన కాకులి బిశ్వాస్ అనే స్నేహితురాలు ఉంది. నగరంలో తనకు తెలిసిన బడా బాబులు ఎందరో ఉన్నారని, వాళ్ళకి మసాజ్ చేస్తే ఎక్కువ డబ్బులిస్తారని బిశ్వాస్‌కు సంజన చెప్పింది. ఈ ఆఫర్ ఏదో బాగుందనుకొని, ఈనెల 9వ తేదీన ధిల్లీ నుంచి బిశ్వాస్ టికెట్ బుక్ చేసుకొని, సంజన నివాసానికి వచ్చింది. 10వ తేదీన సంజన ఇంటికి మరో ఇద్దరు స్నేహితులైన కోమటి, సునీతలు సైతం వచ్చారు.
అయితే.. తన ముగ్గురు స్నేహితులు ఇంటికి వచ్చిన తర్వాత సంజన మాట మార్చింది. మసాజ్ చేయడంతో పాటు శారీరక సుఖం కూడా అందించాలని, అలా చేస్తే అధిక డబ్బులు వస్తాయని చెప్పింది. డబ్బులకు ఆశ పడి.. బిశ్వాస్‌తో పాటు మరో ఇద్దరూ స్నేహితులు కూడా అందుకు ఒప్పుకున్నారు. 12వ తేదీన బిశ్వాస్ క్యాబ్‌లో జూబ్లీహిల్స్‌తోని ఓబుల్‌రెడ్డి పాఠశాల వద్ద నివసించే విటుల వద్దకు వెళ్ళింది. అయితే.. అక్కడికి ఆల్రెడీ కోమటి, సునీతలతో పాటు మరో ఐదుగురు పురుషులు వచ్చారు. అయితే, అక్కడ వీరి మధ్య గొడవ చోటు చేసుకుంది. తాము కోరుకున్న విధంగా ఉండటం లేదని, బిశ్వాస్‌పై ఆ ఇద్దరు అమ్మాయిలు దాడికి పాల్పడ్డారు. బిశ్వాస్ పోలీసులకు ఫోన్ చేయడం, వాళ్ళు రంగంలోకి దిగి సర్దిచెప్పడంతో.. అక్కడి నుంచి అంతా వెళ్ళిపోయారు.
అయితే.. మరుసటి బిశ్వాస్ గురించి సంజనకు కోమటి, సునీతలు చెప్పగా.. వాళ్ళు ముగ్గురు తిరిగి బిశ్వాస్‌పై గొడవకు దిగారు. తాను పోలీసులు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించడంతో.. బిశ్వాస్ పారిపోకుండా ఉండేందుకు ఆమె బట్టలు విప్పేశారు. గదిలో నిర్బంధించి, రకరకాల చిత్రహింసలకు గురి చేశారు. ఎక్కడపడితే అక్కడ కొరకడంతో పాటు స్ప్రే కొట్టారు. దీంతో ఆమె బాత్రూంలోకి వెళ్లి తలుపులు వేసుకొంది. కిటికీలో నుంచి ఎలాగోలా బయటపడ్డ బిశ్వాస్.. పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జరిగిందంతా చెప్పింది. దీంతో.. బిశ్వాస్ ఫిర్యాదు మేరకు సంజన, కోమటి, సునీతలను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.