Lucknow: లక్నోలో దారుణం.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భార్యను చంపి, దొచుకెళ్లిన దుండగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lucknow: ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం చోటు చేసుకుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవేంద్ర నాథ్ దూబే భార్య మోహిని దూబేను దుండగులు హతమార్చినట్లు తెలుస్తోంది. శనివారం లక్నోలోని తన ఇంట్లోనే మోహిని దూబే శవంగా కనిపించింది. ఇంట్లో దొంగతనం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో దేవేంద్ర నాథ్ దూబే గోల్ఫ్ ఆడేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.
దూబే ఇంటికి తిరిగి వచ్చే సమయానికి, ఇంటి ద్వారాలు తెరిచి ఉంచడం గమనించారు, లోపలి వెళ్లి చూడగా ఆయన భార్య మోహిని మెడకు ఉచ్చు బిగించి, చనిపోయి ఉండటాన్ని గమనించారు. లోపల అల్మారా తెరిచి ఉండటంతో పాటు నేలపై అనేక వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంట్లోని నగదు, విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు పోలీసులు వెల్లడించారు. లక్నోలోని ఇందిరానగర్ ప్రాంతంలోని సెక్టార్ 22లోని ఓ పోష్ లొకాలిటీలో ఈ ఘటన జరిగింది.
Also Read
- Child S*exual Abuse Content: ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
Read Also: Swati Maliwal : స్వాతి మలివాల్‌కి రేప్, హత్య బెదిరింపులు.. యూట్యూబర్ ధృవ్ రాథీపై ఆరోపణలు..
‘‘ఉదయం 9.45 గంటలకు DN దూబే గోల్ఫ్ ఆడి తిరిగి వచ్చినప్పుడు, అతను తన భార్య చనిపోయి ఉండటాన్ని కనుగొన్నాడు. పాలవాడు 7.15 గంటలకు పాలను అందించాడు, ప్యాకెట్‌లోని పాలు వేడి చేయకుండా అలాగే ఉన్నాయి.’’ అని లక్నో జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్(క్రైమ్) ఆకాష్ కుల్హారీ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకి పంపామని, డాగ్ స్వ్కాడ్‌తో పాటు మా క్రైమ్ బ్రాంచ్‌కి చెందిన ఫోరెన్సిక్ టీమ్స్ నేరస్థలానికి చేరుకున్నాయని, విచారణ కొనసాగుతోందని, పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత మరణానికి కారణాన్ని నిర్ధారించగమని ఆయన తెలిపారు. దుండగులు తమను కనిపెట్టేస్తారనే కారణంతో సీసీటీవ-డీవీఆర్ సిస్టమ్‌ని తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. అయితే, వారిని గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని అన్ని సీసీటీవీల ఫుటేజ్ పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
తాజావార్తలు
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..