పంజాగుట్టలోని టాలీవుడ్ పబ్ పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ పబ్ లో అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందడంతో వారు ఆకస్మిక దాడులు చేసి 9 మంది యువతులు 34మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పంజాగుట్ట పోలీసులు మాట్లాడుతూ” అంతకుముందు కూడా ఈ పబ్ పై ఎన్నో ఫిర్యాదులు వచ్చాయని, అయితే ఈసారి పబ్ లో అర్ధనగ్న డాన్స్ లు కూడా చేయిస్తున్నారని, సెలబ్రెటీలు సైతం నోరు మెదపకుండా వెళ్తున్నారని తెలియడంతో దాడులు నిర్వహించామని తెలిపారు.
రైడ్ లో 9 మంది యువతులు 34మంది యువకులను అదుపులోకి తీసుకున్నామని తెలిపిన పోలీసులు సమయం దాటిన తర్వాత కూడా వారు అర్ధనగ్నంగా డాన్స్ వేసు కనిపించారని తెలిపారు. పలుసార్లు చెప్పినా పబ్ యాజమాన్యం తమ పద్దతిని మార్చుకోకపోవడంతో ఆర్డీవో ఆదేశాల మేరకు పబ్ ను సీజ్ చేసినట్టు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. ఇక ఈ పబ్ కి టాలీవుడ్ సెలబ్రెటీస్ కూడా వస్తుండడంతో తమనేం చేయలేరన్న భావనలో పబ్ యాజమాన్యం ఉందని స్థానికులు తెలుపుతున్నారు.