Physical Attack on Lady: రెచ్చిపోతున్న కామాంధులు.. రాళ్ళపల్లిలో లైంగిక దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Physical Attack on Lady: ఎన్ని చట్టాలు వచ్చినా .. శిక్షలు పడుతున్నా కామపిశాచుల దాహం తీరడం లేదు. మహిళలు, వృద్ధులు, ముక్కుపచ్చలారని చిన్నారుల్ని కూడా వారు వదలడం లేదు. యజమానులైతే తమ ఇంట్లో పనిచేయడానికి వచ్చిన మైనర్ బాలికల్ని చెరబడుతున్నారు. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం రాళ్ళపల్లిలో సర్వే కోసం వచ్చామని చెప్పి అంగన్వాడీ ఆయాపై లైంగిక దాడికి ఓ వ్యక్తి యత్నించడం కలకలం రేపుతోంది. సర్వే కోసం వచ్చినట్లు చెప్పి అంగన్వాడి కేంద్రంలోకి వెళ్లాడో వ్యక్తి.
అంగన్వాడి కేంద్రంలో పరిశీలిస్తున్నట్లుగా తిరుగుతూ ఆయా చెయ్యి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ మహిళ కేకలు వేయటంతో అక్కడకు వచ్చి దేహశుద్ధి చేశారు స్థానికులు..పోలీసులు వచ్చేలోగా అక్కడి నుంచి పరారయ్యాడా వ్యక్తి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత మహిళ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు, పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తిని నంద్యాలకు చెందిన అమీర్ భాష గా భావిస్తున్నారు బాధితులు. అతని కోసం గాలిస్తున్నారు పోలీసులు.
Also Read
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
Read Also: AP Crime News: భర్త టిఫిన్ తెచ్చేలోపు భార్య మృతి.. అసలు ఏం జరిగిందంటే..?
ఇదిలా వుంటే.. తిరుపతి జిల్లా వెంకటగిరిలో దారుణం జరిగింది. ఇంట్లో పనికిపెట్టుకున్న మైనర్ బాలికపై 6 నెలలుగా లైంగికదాడికి పాల్పడ్డాడో యజమాని. మైనర్ బాలికను గర్భవతి చేసిన ఇంటి యజమాని రియల్ వ్యాపారి వెంకటసుబ్బయ్య (55) అలియాస్ చిన్నారావుగా గుర్తించారు. ఈ విషయం బయటకు రాకుండా, బాలిక తల్లిదండ్రులతో సెటిల్మెంట్ చేశాడో చోటానేత. బాలికకు డబ్బులు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు రియల్ వ్యాపారి. ఈదారుణం బయటపడింది. దీంతో నిందితుడు చిన్నారావును అరెస్ట్ చేసి, ఫోక్స్ యాక్ట్ క్రింద కేసునమోదు చేశారు పోలీసులు.
Read Also: Kartavya Path: నేడు “కర్తవ్యపథ్”ను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్రమోదీ..
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?