Vizag Road Accident: తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకుని మసులుకునే పిల్లలు కొందరైతే.. తమనకు ఏది కావాలన్నా మారం చేసి సాధించుకునేవారు మరికొందరు.. ఇంకో వైపు, తన పిల్లల కోసం ఎంత కష్టానైనా భరించి.. వాళ్లకు మెరుగై జీవితాన్ని అందించాలనే భావించే పేరెంట్స్ ఉన్నారు.. తమ జీవితంలో సాదాసీదాగా బతుకుతున్నాం.. మా పిల్లలు అయినా అన్ని చూడాలి అని తాపత్రయ పడే తల్లిదండ్రులు ఉన్నారు.. అయితే, దసరా రోజు 3 లక్షల రూపాయల అప్పు చేసి బైక్ కొనిచ్చిన తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు ఓ కుమారుడు..
Read Also: AP Politics : ఉదయం 11గంటలకు వైసీపీ నేతలతో జగన్ సమావేశం.
విశాఖపట్నంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాణిపేటలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ శ్రీనివాసరావు దంపతులకు హరీష్ (19) అనే కుమారుడు.. ఇంటర్ వరకు చదివిన హరీష్.. ప్రస్తుతం ఖాళీగా ఉండగా.. ఇటీవల బైక్ కావాలని ఇంట్లో అడిగాడు.. అయితే, డబ్బులు లేవని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు శ్రీనివాసరావు.. అయినా కుమారుడు వినకుండా అలిగి.. మొండిపట్టు పట్టడంతో చివరికి రూ.3లక్షలు అప్పు చేసి దసరా రోజున బైక్‌ను కొనిచ్చాడు.. ఇక, టిఫిన్ చేయడానికి ద్వారకానగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు స్నేహితుడు వినయ్‌తో కలిసి కొత్త బైక్ పై వెళ్లిన హరీష్.. టిఫిన్ చేసిన తర్వాత వినయ్‌ని అతడి ఇంటి వద్ద దించడానికి బయల్దేరాడు.. అసలే కొత్త బైక్ కావడంతో.. అతివేగంతో బైక్‌పై దూసుకెళ్లారు ఇద్దరు స్నేహితులు.. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మితిమీరిన వేగంతో వెళ్తుండగా సిరిపురం దత్ ఐలాండ్ మలుపు వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది హరీష్ బైక్.. ఈ ప్రమాదంలో హరీష్‌కు తీవ్ర గాయాలు కాగా.. అతడి స్నేహితుడు వినయ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.. హరీష్‌ను వెంటనే 108 అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించారు.. కానీ, చికిత్స పొందుకు హరీష్ మృతిచెందాడు.. వినయ్ ప్రాణాలతో బయటపడ్డాడు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు..