సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా చేసిన అశ్లీల నృత్యాలను చూసీ చూడనట్టుగా వ్యవహరించిన ఎస్సైపై సస్సెన్షన్ వేటు పడింది. తూర్పుగోదావరి జిల్లా కరప ఎస్సై రమేష్ బాబుని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కూరాడలో జరిగిన సుబ్రహ్మణ్య షష్ఠి సందర్బంగా అశ్లీల నృత్యాలు చేశారు. ఈ వ్యవహారం రచ్చరేపింది. ముందస్తు సమాచారం రాబట్టడంలో విఫలం కావడంతో ఎస్సై పై చర్యలు తీసుకున్నారు. ఏలూరు రేంజ్ డీఐజీ మోహనరావు ఈమేరకు ఉత్తర్వులు జారీచేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి కార్యక్రమ నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదయింది.
సుబ్మహ్మణ్య షష్టి సందర్భంగా భక్తితో పాటు రక్తికి చోటిచ్చారు. ఇదంతా చేసింది ఎవరో కాదు. ఓ మాజీ ప్రజాప్రతినిధి అయి వుండి అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ చేశారు. పిల్లలకి నీతులు చెప్పాల్సింది పోయి పెద్దలే గంతులేశారు. మాజీ సర్పంచ్ ప్రసాద్ అమ్మాయిలతో కలిసి అసభ్యకరంగా చిందులేశారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. ఎస్సైపై వేటు వేశారు. కార్యక్రమ నిర్వాహకులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.