Vaishnavi Murder Case: కడప జిల్లా గండికోటలో జరిగిన మైనర్ బాలిక హత్య కేసులో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. లైవ్ డిటెక్టర్ పరీక్ష కు సిద్ధం కావాలని వైష్ణవి కుటుంబ సభ్యులకు పోలీసులు నోటీసు జారీ చేశారు.. దారుణ హత్యకు గురైన మైనర్ బాలికకు అన్న వరుస అయ్యే కొండయ్య, సురేంద్ర, బాలిక ప్రియుడు లోకేష్ కు నోటీసులు ఇచ్చారు పోలీసులు.. ఈనెల 26వ తేదీన జమ్మలమడుగు కోర్టుకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.. అయితే, వీరికి హైదరాబాద్‌లో లైవ్ డిటెక్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు పోలీసులు.
Read Also: Betting Apps Bill : ఆన్‌లైన్ గేమింగ్ కొత్త బిల్లు.. ఈ-స్పోర్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్..కానీ ..!
కాగా, ప్రియుడితో కలిసి పర్యాటక కేంద్రానికి వెళ్లిన ఆ మైనర్ బాలిక చివరకు శవమై కనిపించింది. మొదట ప్రియుడే ఆ బాలికను హత్య చేశాడని అందరూ భావించారు …అయితే చివరికి ట్విస్ట్ ల మీద ట్విస్టులు వస్తుండడంతో పోలీసులు సైతం అవాక్క అవ్వక తప్ప లేదు… ఇంతకీ మిస్టరీగా మారిన మైనర్ బాలిక హత్యను కేసు పోలీసులకు సవాలు గా మారిందా… అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు… ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. అతని వేధింపులు తట్టుకోలేక కుటుంబం అంతా ఊరే వదిలి వేరే ఊరు మారారు. అయినా వదలకుండా వెంటపడ్డాడు. ప్రేమ పేరుతో అభంశుభం తెలియని బాలికకు మాయమాటలు చెప్పి నమ్మించి నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి అతి దారుణంగా హత్య చెసాడు ఇది తల్లిదండ్రులు ఆరోపణ… అయితే వైష్ణవి, లోకేష్ ఇద్దరూ పల్సర్ బైక్ పై ఆనందంగా గండికోటకు వెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.. రెండు గంటల తర్వాత లోకేష్ ఒంటరిగా వేగంగా జమ్మలమడుగు వైపు తిరిగి వెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి… అయితే మైనర్ బాలికను ఆ యువకుడే హత్య చేసి పరారయ్యాడా ! లేక ఎవరికైనా ఆ బాలికను అప్పగించి వెళ్ళాడా.. లేదా మరెవరైనా అతనిని భయపెట్టి ఆ బాలికను హత్య చేశారా అన్నది సందిగ్ధంగా మారింది… బాలిక మృతదేహాన్ని గండికోట నుంచి జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఫోరెన్సిక్ వైద్యులు చేత పోస్ట్ మార్టం చేయించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి.
Read Also: Ganesh Chaturthi Online Permission: గణేష్ ఉత్సవాలకు ఆన్‌లైన్‌లోనే అనుమతులు.. ఇలా చేస్తే చాలు..!
పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పోలీసులకు పలు అనుమానాలకు తావిచ్చాయి. హత్యకు గురైన వైష్ణవి పై లైంగిక దాడి జరగలేదని, బలంగా కొట్టడంతో వైష్ణవి శరీరంలోని అంతర్గత భాగాలు దెబ్బ తినడం వల్లనే వైష్ణవి మరణించిందని పోస్ట్‌మార్టం నివేదిక వచ్చింది. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారించి, లోకేష్ ఇచ్చిన సమాచారాన్ని మరొకసారి చెక్ చేసుకుని ప్రియుడు లోకేష్.. వైష్ణవి ని హత్య చేయలేదని నిర్ధారణకు వచ్చారు పోలీసులు. దీంతో వైష్ణవి హత్య కేసు మరో కొత్త కోణం రూపుదిద్దుతుంది. మైనర్ బాలిక వైష్ణవి పై ఎవరు లైంగిక దాడి కి పాల్పడలేదు మరి వైష్ణవి ని అంత దారుణంగా కొట్టి చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది, అనే కోణంలో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. డీఐజీ కోయా ప్రవీణ్ జమ్మలమడుగు చేరుకొని వైష్ణవి కేసుపై ప్రత్యక్షంగా విచారణ చేపట్టారు. లోకేష్.. వైష్ణవి లు గండికోటకు వెళ్లిన సమాచారం వైష్ణవి స్నేహితుల ద్వారా అన్న సురేంద్ర తెలుసుకుని సురేంద్ర, లోకేష్ బంధువులకు ఫోన్ చేసి మీ అబ్బాయి ఎక్కడున్నాడంటూ ప్రశ్నించడం వారు తెలియదని సమాధానం చెప్పడంతో లోకేష్ వైష్ణవి ఇద్దరు కలిసి గండికోటకు వెళ్లారని వైష్ణవి అన్న సురేంద్ర జులై 15న ఉదయం గండికోటకు వెళ్లాడు. అయితే వైష్ణవి అన్న సురేంద్ర గండికోటకు వస్తున్న విషయాన్ని లోకేష్ బంధువులు ఫోన్ చేసి చెప్పడంతో సురేంద్ర గండికోటలో తమరిని చూస్తే సమస్య అవుతుందని ఉద్దేశించి వైష్ణవి గండికోట ముఖద్వారం వద్ద వదిలిపెట్టి ఒక్కడే పల్సర్ బైక్ పై అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత గండికోటకు చేరుకున్న సురేంద్ర అక్కడ వైష్ణవి ఫోటోని చూపించి పలువురిని అడిగినట్లు తెలుస్తుంది.
Read Also: Heart Attack: ఆగిన ట్రాఫిక్ ఏఎస్సై గుండె.. కారు డ్రైవ్ చేస్తుండగానే మృతి
ఇక, లోకేష్ వెళ్లిన తర్వాత సురేంద్ర గండికోటకు చేరుకున్న తర్వాత వైష్ణవి హత్య ఏ విధంగా జరిగిందన్న కోణంలో పోలీసులు విచారణ మొదలుపెట్టారు .దీంతో వైష్ణవి హత్య చేసింది వైష్ణవి అన్న సురేంద్రనే అయి ఉండొచ్చు అనే కోణంలో పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. లోకేష్ వైష్ణవిల ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసిన తర్వాత స్వగ్రామమైన హనుమన గుత్తిని వదిలిపెట్టి వైష్ణవి కుటుంబం ప్రొద్దుటూరుకు చేరుకున్నప్పటికీ తమ మాట వినకుండా మళ్ళీ లోకేష్ తో గండికోటకు కలిసి వెళ్లిన వైష్ణవి పై అన్న సురేంద్ర కోపంతో దాడి చేశాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. వైష్ణవి పై లైంగిక దాడి జరగలేదు, లోకేష్ వైష్ణవిని హత్య చేయలేదు. ఈ రెండు విషయాలను పోలీసులు తమ విచారణలో నిగ్గు తేల్చారు. గండికోటలో వైష్ణవి చూసిన అన్న సురేంద్ర ఆవేశంతో వైష్ణవిని దారుణంగా కొట్టడంతో బాలిక మృతి చెంది ఉంటుందని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ మైనర్ బాలిక హత్య గండికోట రహస్యంగా మారిందని చెప్పవచ్చు… పోలీసులు విచారణలో ఎటువంటి సాక్ష్యాధారాలు లభించుకపోవడంతో అనుమానితులకు లైవ్ డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చారట.. అందుకోసం ఈనెల 26న దారు హత్య కు గురైన బాలిక కు వరుసకు అన్న అయ్యే కొండయ్య, సురేంద్ర లతోపాటు బాలిక ప్రియుడు లోకేష్ ను కోర్టులో హాజరు పెట్టనున్నారు.. మరి పోలీసులు ఈ కేసును ఎలా చేదిస్తారో వేచి చూడాలి మరి…