గండికోటలో జరిగిన మైనర్ బాలిక హత్య కేసులో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. లైవ్ డిటెక్టర్ పరీక్ష కు సిద్ధం కావాలని వైష్ణవి కుటుంబ సభ్యులకు పోలీసులు నోటీసు జారీ చేశారు.. దారుణ హత్యకు గురైన మైనర్ బాలికకు అన్న వరుస అయ్యే కొండయ్య, సురేంద్ర, బాలిక ప్రియుడు లోకేష్ కు నోటీసులు ఇచ్చారు పోలీసులు.. ఈనెల 26వ తేదీన జమ్మలమడుగు కోర్టుకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.. అయితే, వీరికి హైదరాబాద్‌లో లైవ్ డిటెక్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు…
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మైనర్ బాలిక హత్య గండికోట రహస్యంగా మారింది ... మైనర్ బాలిక హత్య జరిగి 11 రోజులు కావస్తున్నా ఇంకా తేలని వైనం.. అయితే ఈ కేసు పోలీసులకు సవాలుగా మారిందా ? రోజుకో మలుపు తిరుగుతూ మిస్టరీగా మారిందా.. గండికోట ను రోజు జల్లెడ పట్టిన ఆనవాళ్లు లభించలేదా? ఇంతకీ ఆ కోటలో ఏమి జరిగింది ?
కడప జిల్లాలోని గండికోటలో మైనర్ బాలిక హత్య జరిగి నేటికి వారం రోజులు అవుతోంది. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టి కేసును కొలిక్కి తెచ్చారు. బాలిక హత్య కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. బాలిక సోదరులే హంతుకులని నిర్ధారించారు పోలీసులు. ప్రేమ వ్యవహారం.. కుటుంబ పరవువుతీస్తోందనే బాలికను ఆమె అన్నలు హతమార్చినట్లు తెలిపారు. బాలిక, బాలిక లవర్ లోకేష్ వేర్వేరు కులాలు కావడం.. ఆస్థిపాస్తుల్లోనూ తమతో సరితూగరనే భావనలో బాలిక బంధువులు ఉండడం.. ఇవే హత్యకు…
Gandikota Murder Case: కడప జిల్లాలోని గండికోటలో మైనర్ బాలిక హత్య జరిగి నేటికి వారం రోజులు అవుతున్నప్పటికీ ఈ కేసు ఇప్పటి వరకు మిస్టరీగానే ఉంది. అయితే, పోలీసుల విచారణలో కీలక విషయాలు గుర్తించినట్లు సమాచారం.
Pemmasani Chandrasekhar: గండికోటను ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోని గండికోటకు సుమారు 78 కోట్ల పర్యాటక శాఖ నిధులను కేటాయించాం అని తెలిపారు.
ప్రపంచంలో చాలా అందమైన ప్రాంతాలను చూశానని.. ఇలాంటి శత్రు దుర్భేద్యమైన కోట, లోయ ఎక్కడా లేవని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఇక్కడున్న విశాలమైన కొండలు, లోయలు చూస్తుంటే తన మనసు పులకించిందన్నారు. గండికోట ప్రాంతంలో త్వరలో 100 అడుగుల శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. గండికోటను మాజీ సీఎం వైఎస్ జగన్ ఏ రకంగానూ అభివృద్ధి చేయలేదు అని పెమ్మసాని విమర్శించారు. నేడు ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన గండికోటను జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కలిసి…
ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నూతన సంవత్సరం వేడుక జోష్ లో యువత మునిగిపోయింది. కొత్త సంవత్సర వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. న్యూ ఇయర్ వేడుకల కోసం గండికోటకు వెళుతుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి స్కార్పియో బోల్తా పడింది. ఈ క్రమంలో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు.
గండికోట ప్రపంచంలో టాప్ 10 ప్రదేశాలలో ఒకటని.. 13వ శతాబ్దం లో నిర్మించారని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. గండికోటలో కోట సముదాయంలో రాజవంశాల వారసత్వాలు ఉన్నాయన్నారు. గండికోట లోఅడ్వంచెర్ గేమ్స్‌కి అవకాశాలు ఉన్నాయని.. గండికోట లో కూడా సీప్లేన్ ఆపరేషన్స్ ఉంటాయి.. ఇవాళే అక్కడ దిగాలనుకున్నామన్నారు. కేంద్రం సహకారంతో సీప్లేన్‌లు ఎక్కువ ప్రాంతాల్లో పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.