గండికోటలో జరిగిన మైనర్ బాలిక హత్య కేసులో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. లైవ్ డిటెక్టర్ పరీక్ష కు సిద్ధం కావాలని వైష్ణవి కుటుంబ సభ్యులకు పోలీసులు నోటీసు జారీ చేశారు.. దారుణ హత్యకు గురైన మైనర్ బాలికకు అన్న వరుస అయ్యే కొండయ్య, సురేంద్ర, బాలిక ప్రియుడు లోకేష్ కు నోటీసులు ఇచ్చారు పోలీసులు.. ఈనెల 26వ తేదీన జమ్మలమడుగు కోర్టుకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.. అయితే, వీరికి హైదరాబాద్‌లో లైవ్ డిటెక్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు…
కడప జిల్లా గండికోటలో జరిగిన ఇంటర్ విద్యార్థిని వైష్ణవి హత్య కేసులో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. విద్యార్థిని వైష్ణవిని ప్రియుడు లోకేష్ హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. అసలు, మైనర్ బాలిక హత్య కేసులో ప్రియుడు లోకేష్ ప్రమేయం లేదని కర్నూల్ డీఐజీ కోయ ప్రవీణ్ స్పష్టం చేశారు..