Betting Apps Bill : ఆన్‌లైన్ గేమింగ్‌పై నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకొచ్చింది. దీనికి పేరు ‘ఆన్‌లైన్ గేమింగ్ అభివృద్ధి, నియంత్రణ బిల్లు’. ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందింది. దీని ప్రధాన ఉద్దేశ్యం ఆన్‌లైన్ సోషల్ గేమ్స్, ఈ-స్పోర్ట్స్‌ను ప్రోత్సహించడం, అలాగే ఆన్‌లైన్ గేమింగ్‌పై నియంత్రణ తీసుకురావడం. తాజాగా ప్రవేశపెట్టిన ఈ బిల్లులో ఆన్‌లైన్ మనీ గేమ్స్ ఆడే వారికి శిక్ష ఉండదు. కానీ, వాటిని అందించే సర్వీస్ ప్రొవైడర్లు, ప్రకటనలు ఇచ్చేవారు, ప్రచారం చేసేవారు, ఆర్థిక సహాయం అందించే వారు మాత్రం కఠిన శిక్షలు ఎదుర్కోవలసి ఉంటుంది.
NTR Fans : మా హీరో ఏం చేశారు?.. ఏపీలో ప్రెస్ మీట్ పెట్టనివ్వలేదు!
బిల్లుతో పాటు ప్రభుత్వం తెలిపిన దానిలో, ఆన్‌లైన్ మనీ గేమ్స్ నిర్వహణ, ప్రకటనలు, ఆర్థిక లావాదేవీలపై పూర్తిగా నిషేధం అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. మరోవైపు, ఇప్పటి వరకు చట్టబద్ధ మద్దతు లేని ఈ-స్పోర్ట్స్‌కు ఇప్పుడు గుర్తింపు లభించనుంది. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ-స్పోర్ట్స్‌ను దేశంలో ఒక పోటీ క్రీడగా అభివృద్ధి చేసే దిశగా ఒక ప్రత్యేక చట్రం రూపొందించనుంది. అలాగే ప్రభుత్వం ఆన్‌లైన్ సోషల్ గేమ్స్‌ను ప్రోత్సహించనుంది. సర్కార్ వర్గాల ప్రకారం, ఆన్‌లైన్ మనీ గేమ్స్ సమాజానికి పెద్ద ముప్పుగా మారాయి. వీటి వలన మోసాలు, ఆర్థిక నష్టాలు, కుటుంబాల పతనం మాత్రమే కాకుండా ఆత్మహత్యలు, హింసాత్మక ఘటనలు కూడా పెరుగుతున్నాయి. అందువల్ల, ఇలాంటి గేమ్స్‌పై నిషేధం ద్వారా ప్రజల ప్రాణాలు, ఆర్థిక పరిస్థితులు కాపాడాలని కేంద్రం భావిస్తోంది.
Tummala Nageswara Rao : కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల కౌంటర్