Live-in Relation: లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్న మహిళ దారుణహత్య.. బిడ్డను కూడా వదల్లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Live-in Relation: లివ్ ఇన్ రిలేషన్‌షిప్ ఉన్న జంటల్లో ఇటీవల హత్యలు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్య తర్వాత ఇలాంటివి చాలా ఘటనలు నమోదవుతున్నాయి. తాజాగా మహరాష్ట్ర నాగ్‌పూర్‌లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. సహజీవనం చేస్తున్న మహిళను ఆమె భాగస్వామి హత్య చేయడంతో పాటు ఆమె బిడ్డను కూడా చంపేశాడు. చివరకు అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
శనివారం నాగ్‌పూర్‌లోని ఓ హోటల్‌లో 30 ఏళ్ల సచిన్ వినోద్ కుమార్ రౌత్ అనే వ్యక్తి 29 ఏళ్ల నజ్నిన్, ఆమె కుమారుడు యుగ్‌లను చంపేశాడు. ఈ ఉదంతం తర్వాత రౌత్ ఆత్మహత్య చేసుకున్నాడు. హోటల్ సిబ్బంది ఈ హత్యల్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రౌత్ సీలింగ్ ఫ్యాన్‌కి ఉరేసుకుని కనిపించగా.. నజ్నిన్ తలకు గాయం కావడంతో రక్తపు మడుగులో కనిపించింది. ఆమెను తలపై సుత్తెతో కొట్టిన ఆనవాళ్లు ఉన్నాయి. అయితే, యుగ్ శరీరంపై ఎలాంటి గాయాలు కనిపించలేదని పోలీసులు తెలిపారు.
Also Read
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్‌లోనే యువతి హత్య
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
Read Also: Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరికి మరో బంఫర్ ఆఫర్.. ఆ సినిమాలో ఛాన్స్..
ప్రాథమిక దర్యాప్తులో రైత్ బాలుడికి విషం ఇవ్వడం లేదా గొంతు నులిమి చంపినట్లు అనుమానిస్తున్నారు. బాలుడిని చంపడానికి ముందే నజ్నిన్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు హత్యల తర్వాత నిందితుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. వృత్తిరీత్యా ట్రక్ డ్రైవర్ అయిన రౌత్‌కి అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. మధ్యప్రదేశ్‌కి చెందిన నజ్నిన్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. రౌత్ భార్యకు విడాకులు ఇవ్వకుండా, నజ్నిన్‌తో సహజీవనం చేస్తున్నాడు.
ఈ క్రమంలో రౌత్ నజ్నిన్‌కి ఇటీవల కాలంలో దూరంగా ఉండటం ప్రారంభించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభయ్యాయి. చివరకు వారు విడివిడిగా ఉండాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఇద్దరు విడివిడిగా ఉండాలని నిర్ణయించుకుని 500 రూపాయల స్టాంప్ పేపర్‌పై పరస్పర ఒప్పందంపై సంతకాలు చేశారు. పోలీసులు విచారణ సందర్భంగా ఈ పేపర్‌ని స్వాధీనం చేసుకున్నారు. శనివారం మధ్యహ్నం రౌత్, నజ్నిన్, బాలుడు హోటల్‌కి వచ్చినట్లు సిబ్బంది తెలిపింది.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!