దారుణం: భర్త ఆ పని చేశాడని.. పిల్లలను బాత్ టబ్ లో ముంచి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం వివాహ బంధంలో ప్రేమ కన్నా అనుమానమే ఎక్కువ కనిపిస్తుంది. ఆ అనుమానంతో భార్యాభర్తలు ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. ఇటీవల భార్య అనుమానించిందని ఆమెను, కన్న బిడ్డలని కడతేర్చి భర్త కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎంతటి సంచలనాన్ని రేకెత్తించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా అలాంటి సంఘటనే జర్మనీలో వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే.. జర్మనీలోని సోలెంగెన్ పట్టణానికి చెందిన ఒక మహిళకు కొన్నేళ్ల క్రితం ఒక వ్యక్తితో పెళ్ళైంది. వీరికి ఆరుగురు పిల్లలు. ఎప్పుడు సంతోషంగా ఉండే వీరి కాపురంలో అనుమానం చిచ్చుపెట్టింది. భర్త వేరొక మహిళతో చనువుగా ఉన్న ఫోటో ఒకటి భార్య కంటపడింది. దీంతో ఆమె ఆగ్రహానికి గురైంది. కోపంలో అనుకోని దారుణ నిర్ణయం తీసుకుంది. భర్త మీద కోపంతో ఇంట్లో ఉన్న ఐదుగురు పిల్లలను బాత్ టబ్ లో ముంచి హత్య చేసింది.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
అనంతరం ఆమె కూడా దగ్గర్లోని రైల్వే ట్రాక్ మీదకు వెళ్లి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అక్కడ స్థానికులు ఆమెను ఆపి పోలీసులకు అప్పగించారు. భర్త, పెద్ద కుమారుడు బయటికి వెళ్లడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన గతేడాది జరుగగా.. ఇటీవల కోర్టు ఆమెకు తగిన శిక్షను విధించింది. ఆమెకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునివ్వగా.. ఆమెకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోరుతూ ఒక లాయర్ పిటిషిన్ పెట్టడం మరో సంచలనంగా మారింది. ఆమెకు మానసిక స్థితి సరిగ్గా లేదని, అందుకే ఆమె అలా చేసిందని కోర్టులో తెలిపాడు. దీనికి న్యాయస్థానం వివరణ కావాలని, ఆమె పిల్లలను చంపిన తర్వాత భర్తకు ఇక నా పిల్లలను చూసే అవకాశం నీకు లేదని మెసేజ్ పెట్టింది.. అంటే మానసిక స్థితి సరిగ్గా లేనివారు అలాంటి మెసేజ్ ఎలా పెట్టగలరు అని తెలుపూతూ బెయిల్ ని నిరాకరించింది.
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!