Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- డ్యాన్స్ చేస్తూ మొదలైన గొడవ.. యువకుల మధ్య ఘర్షణ
- యువకులను బయటకు పంపే క్రమంలో బౌన్సర్లతో వివాదం
- రోడ్డుపైకి పాకిన ఫైట్.. వైరల్‌గా మారిన వీడియోలు
- సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్న త్రీ టౌన్ పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నంలోని ‘క్యూబా’ (Quba) పబ్‌లో తీవ్ర కలకలం రేగింది. పబ్‌లో యువకులు కేరింతలు కొడుతూ పార్టీ చేసుకుంటుండగా, డ్యాన్స్ చేసే క్రమంలో ఒకరికొకరు తగలడంతో చిన్నపాటి వివాదం మొదలైంది. ఒకరినొకరు నెట్టుకోవడంతో మాటమాట పెరిగి క్షణాల్లో ఘర్షణకు దారితీసింది. పబ్ లోపల యువకులు గుంపులుగా విడిపోయి పరస్పరం దాడులకు దిగడంతో అక్కడున్న ఇతర వినియోగదారులు భయాందోళనకు గురయ్యారు.
బౌన్సర్ల జోక్యం.. రోడ్డుపైకి పాకిన భౌతిక దాడి
పబ్‌లో గొడవను సద్దుమణిగించేందుకు అక్కడ విధులు నిర్వర్తిస్తున్న బౌన్సర్లు రంగంలోకి దిగారు. గొడవ పడుతున్న యువకులను బలవంతంగా పబ్ నుంచి బయటకు పంపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సదరు యువకులకు, బౌన్సర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మాట వినకపోవడంతో ఇరువర్గాల మధ్య గొడవ భౌతిక దాడికి దారితీసి, పబ్ బయట ప్రధాన రోడ్డుపైకి పాకింది. బహిరంగంగా రోడ్డుపైనే బౌన్సర్లు, యువకులు పరస్పరం దాడులు చేసుకుంటుండగా స్థానికులు తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో క్షణాల్లో వైరల్‌గా మారడంతో నగరంలో తీవ్ర చర్చనీయాంశమైంది.
Also Read
- Ambati Rambabu: ప్రజల్లో వైసీపీపై అనుకూలత పెరిగింది.. అందుకే టీడీపీ నామినేషన్లు అడ్డుకుంటుంది
- AP Politics : ఏపీలో తీవ్రస్థాయికి చేరిన రాజకీయ పోరు.. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్.. పలువురు హౌస్ అరెస్టులు..
- Road Accident: కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి..
- AP Municipal Elections : ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్.. SEC కీలక ఉత్తర్వులు..
రంగంలోకి త్రీ టౌన్ పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన
సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ కావడంతో త్రీ టౌన్ పోలీసులు తక్షణమే స్పందించి కేసు నమోదు చేశారు. ఈ రగడపై పూర్తిస్థాయి విచారణ ప్రారంభించారు. పబ్ యాజమాన్యంతో పాటు గొడవలో పాల్గొన్న బౌన్సర్లు, సదరు యువకులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారు. పబ్ లోపల, బయట ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరా ఫుటేజీలను సేకరించి నిశితంగా పరిశీలిస్తున్నామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
CM Revanth: కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. లెక్కల్లో తేడాలుంటే కేబినెట్లో చర్చ..
-
Amit shah: ఇంకో 30 ఏళ్ల వరకు అధికారంలోకి రారు.. రాహుల్‌గాంధీ టూర్‌పై అమిత్ షా విమర్శలు
-
Dawood Ibrahim: ‘‘బిన్ లాడెన్ దొరికిన దేశంలోనే దావూద్ ఇబ్రహీం’’.. UN రిపోర్ట్‌పై భారత్ అభ్యంతరం..
-
France Riots: ఫ్రాన్స్ అల్లర్లు, భారత్ నిరసనల వెనక అంతర్జాతీయ కుట్ర.. 9 దేశాల్లో 101 సంస్థల నెట్వర్క్..
-
Honey Trap: ఖాకీలనే బురిడీ కొట్టించిన ‘హనీ’ కేటుగాడు.. వలపు వలలో 1000 మందికి పైగా బాధితులు..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!