Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సరికొత్త రోడ్ల నిర్మాణానికి ఏపీసీఆర్డీఏ శ్రీకారం చుట్టింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా గ్రీన్ మొబిలిటీకి పెద్దపీట వేస్తూ పాదచారులు, సైక్లిస్టుల కోసం ప్రత్యేక రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం N9 రోడ్డు సమీపంలో మోడల్ వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌ల నిర్మాణం జరుగుతోంది. సాధారణ నగరాల్లో మాదిరిగా కేవలం వాహనాల మార్గమే కాకుండా, మాస్టర్‌ప్లాన్‌లో నాన్-మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్కు అత్యంత ప్రాధాన్యత కల్పించారు. కారు లేదా బైక్ లేకపోయినా సురక్షితంగా ప్రయాణించేలా ఈ స్మార్ట్ రోడ్లను డిజైన్ చేస్తున్నారు.
ఈ ప్రత్యేక స్మార్ట్ రోడ్లలో 3 మీటర్ల ఫుట్‌పాత్, 3 మీటర్ల సైకిల్ ట్రాక్, వీటి మధ్య మరో 3 మీటర్ల గ్రీన్ బెల్ట్ ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ఫుట్‌పాత్‌ను సైకిల్ ట్రాక్ కంటే కొంత ఎత్తులో లేదా ఒకే స్థాయిలో ఉంచే రెండు రకాల డిజైన్లను అధికారులు పరిశీలిస్తున్నారు. సైక్లిస్టులకు ప్రత్యేక గుర్తింపు ఉండేలా ప్రత్యేక రంగులు లేదా పిగ్మెంటేషన్‌ను ఉపయోగించనున్నారు. దీనివల్ల ఏది వాహనాల మార్గం, ఏది సైకిల్ లేదా పాదచారుల మార్గం అనేది స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాకుండా.. స్టార్మ్ వాటర్ డ్రైన్ల పైన సైకిల్ ట్రాక్‌లు, ఐసీటీ యుటిలిటీ డక్ట్లు, సీవర్ లైన్ల పైన పాదచారుల మార్గాలను ఏర్పాటు చేసే వినూత్న విధానాన్ని పరిశీలిస్తున్నారు. రోడ్డు, డ్రైనేజీ, పాదచారులు, సైకిల్ ట్రాక్‌లన్నింటినీ ఒకే సమగ్ర డిజైన్‌లో ఇక్కడ అమర్చుతున్నారు.
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
ఏపీసీఆర్డీఏ ప్రణాళిక ప్రకారం అమరావతిలో సుమారు 3,200 కిలోమీటర్ల మేర పాదచారుల మార్గాలు, సైకిల్ ట్రాక్‌ల నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయనున్నారు. పార్కులు, ఓపెన్ స్పేస్‌లు, గ్రీన్ ఏరియాలను ఈ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేయనున్నారు. వ్యక్తిగత వాహనాల వినియోగం పెరిగే కొద్దీ ట్రాఫిక్ ఒత్తిడి, కాలుష్యాన్ని తగ్గించేందుకు నడక, సైక్లింగ్, ప్రజా రవాణాను మిళితం చేసి గ్రీన్ మొబిలిటీని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ స్మార్ట్ రోడ్లలో అందమైన టైల్స్‌తో పాటు భద్రత, వెలుతురు, వర్షపు నీటి పారుదల, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అమరావతి మొత్తం ఈ స్మార్ట్ రోడ్లు విస్తరిస్తే, రాజధాని రూపురేఖలతో పాటు ప్రజల ప్రయాణ విధానం పూర్తిగా మారిపోనుంది.
తాజావార్తలు
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!