భర్తతో చక్కని సంసారం.. అత్తమామల ప్రేమాభిమానాలు.. రత్నంలాంటి పిల్లలు.. ఒక మహిళకు ఇంతకన్నా ఏమి కావాలి.. కానీ , కొంతమంది మహిళలు పచ్చని కాపురాలను వారి చేజేతులారా వారే నాశనం చేసుకుంటున్నారు.. పరాయి వారి మోజులోపడి చివరికి పరువు పోగొట్టుకొని కట్టుకున్నవారి ప్రేమకు నోచుకోకుండా పోతున్నారు. తాజాగా ఒక మహిళ భర్తకు తెలియకుండా ఒక యువకుడితో ప్రేమ నాటకం ఆడి, అతడితో నగ్న వీడియో కాల్స్ మాట్లాడి రెచ్చగొట్టింది. చివరికి అతడు పెళ్లి అని షాక్ ఇచ్చేసరికి చేసేది లేక పోలీసులను ఆశ్రయించి పరువు పోగొట్టుకున్న ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది. సరదాగా చేసిన ఒక పని ఆమె జీవితాన్ని నాశనం చేసింది.
వివరాల్లోకి వెళితే.. జబల్పూర్ కి చెందిన మహిళ(26)కు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. భర్త , పిల్లలతో హ్యాపీ గా ఉండే ఆమెకు సోషల్ మీడియా లో ఒక యువకుడు పరిచయమయ్యాడు. మహిళ కూడా భర్త ఉద్యోగానికి వెళ్ళాకా అతడితో మాట్లాడడం ప్రారంభించింది. తనకు పెళ్లి కాలేదని తెలుపుతూ ప్రేమ సూక్తులు చెప్పుకొచ్చింది. దీంతో సదురు యువకుడు ఈమెతో ప్రేమలో పడ్డాడు. అనంతరం ఇద్దరు న్యూడ్ కాల్స్ కూడా మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఇలా సాగుతున్న వీరి బంధంలో ఒకరోజు యువకుడు పెళ్లి మాట ఎత్తాడు. దీంతో చేసేదేం లేక మహిళ తనకు పెళ్లి అయ్యిందని, పిల్లలు ఉన్నారని చెప్పింది. అయినా పర్లేదని, ఆమె మాత్రమే కావాలని పట్టుబట్టాడు. భర్తకు విడాకులు ఇచ్చి తనతో వచ్చేయాలని, లేకపోతె తన నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. ఇక సదురు మహిళ అతడి బెదిరింపులు ఎక్కువ కావడంతో భర్తకు విషయం చెప్పి, భర్త సాయంతో పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.