Extramarital Affair: ఆమె ఒక వితంతువు. తన కొడుకుతో ఒంటరిగా ఉంటోన్న ఆమె.. ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే.. అదే ఆమె పాలిక శాపంగా మారింది. ఆమెను మృత్యువు ఒడికి చేర్చింది. అసలేమైందంటే.. తమిళనాడులోని వేలూరు జిల్లా, అనకట్టు తాలుకా, వాయపందల్ గ్రామానికి చెందిన మలర్(28)కు కొన్ని సంవత్సరాల క్రితం వినోద్ కుమార్ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. ఈ దంపతులకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే.. కొద్ది నెలల క్రితం అనారోగ్య సమస్యల కారణంగా వినోద్ కుమార్ మృతిచెందాడు. అప్పటినుంచి మలర్ తన కుమారుడితో ఒంటరిగా ఉంటూ వస్తోంది.
Harish Rao: గులాబీ పార్టీ ప్రజలకు గులాంగిరి చేస్తుంది.. ఢిల్లీ పెద్దలకు కాదు..
కట్ చేస్తే.. భర్త మృతి చెందిన తర్వాత మలర్‌కు షణ్ముగం(30) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులకే అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీళ్లిద్దరు ఉల్లాసంగా తమ జీవితాన్ని అనుభవించారు. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో.. గ్రామ పెద్దలు వారిని పిలిపించి హెచ్చరించారు. ఈ పాడు పని ఆపేయాల్సిందిగా సూచించారు. దీన్ని అవమానంగా భావించిన మలర్.. షణ్ముగంను దూరం పెట్టింది. కానీ.. షణ్ముగం మాత్రం ఆమెను విడిచిపెట్టలేదు. మళ్లీ ఆమె వెంటపడటం మొదలుపెట్టాడు. గ్రామ పెద్దల మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, తామిద్దరం కలిసి ఉందామని ఒప్పించడానికి ప్రయత్నించాడు. మలర్ మాత్రం అందుకు అంగీకరించలేదు. తనని ఒంటరిగా విడిచిపెట్టాలని, తన వెంటపడొద్దని కోరింది. అయినా షణ్ముగం వినిపించుకోలేదు. ఆమెను వేధింపులకు గురి చేస్తూ వచ్చాడు.
David Warner: డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత.. రోహిత్ శర్మ రికార్డ్ బద్దలు
ఈనెల 17వ తేదీన వితంతు పింఛన్ కోసం మలర్ వెళ్లింది. ఈ విషయం తెలిసి.. షణ్ముగం ఆమె వెంట వెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతంలో ఆమెని అడ్డగించి, మాట్లాడాలని పక్కకు తీసుకెళ్లాడు. తనతో శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి చేశాడు. మలర్ అందుకు నిరాకరించడంతో.. కోపాద్రిక్తుడైన షణ్ముగం పక్కనే ఉన్న బండరాయి తీసుకొని ఆమె తలపై మోపాడు. దీంతో.. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భయంతో షణ్ముగం అక్కడి నుంచి పారిపోయాడు. ఇంటికి తిరిగిరాని మలర్ కోసం వెతకగా.. బుధవారం సాయంత్రం అటవీప్రాంతంలో మృతదేహంలో కనిపించింది. స్థానికులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. షణ్ముగం చంపాడని తేల్చి, అతడ్ని అరెస్ట్ చేసి, వేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు.