David Warner: డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత.. రోహిత్ శర్మ రికార్డ్ బద్దలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
David Warners Creates New Record In IPL: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్రపుటలకెక్కాడు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన వార్నర్ (41 బంతుల్లో 11 ఫోర్ల సహాయంతో 57 పరుగులు).. ఈ సందర్భంగానే ఆ రికార్డ్ నెలకొల్పాడు. ఇప్పటివరకు కేకేఆర్‌పై 26 మ్యాచ్‌లు ఆడిన అతగాడు.. 146 సగటుతో 1042 పరుగులు చేశాడు. అంతకుముందు.. 1040 పరుగులతో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉండేవాడు. ఇప్పుడు రెండు పరుగుల తేడాతో రోహిత్ రికార్డును వార్నర్ బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ తర్వాత శిఖర్ ధావన్ 850 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.
Sai Dharam Tej: రెండేళ్లు అనుభవించిన నరకానికి దక్కిన ఫలితం.. ఈ విజయం
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు 127 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో.. కేకేఆర్ జట్టు పేకమేడల్లా కుప్పకూలింది. జేసన్ రాయ్ (43), ఆండ్రూ రసెల్ (38) పుణ్యమా అని.. కేకేఆర్ ఆమాత్రం స్కోరు చేయగలిగింది. ఇక 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డీసీ జట్టు.. 19.2 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసి గెలుపొందింది. డేవిడ్ వార్నర్ అర్థశతకంతో చెలరేగగా.. మనీష్ పాండే (23), అక్షర్ పటేల్ (19) కీలక ఇన్నింగ్స్ ఆడడంతో డీసీ విజయతీరాలకు చేరింది. నిజానికి.. మొదట్లో డీసీ దూకుడుగా ఆడటం చూసి, ఈ మ్యాచ్‌ని డీసీ త్వరగా ముగించేస్తుందని అంతా భావించారు. కానీ.. కేకేఆర్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేయడంతో, ఈ మ్యాచ్ చివరివరకు ఉత్కంఠభరితంగా సాగింది.
Karumuri Nageswara Rao: రాజధాని వైజాగే.. అక్కడి నుండే పాలన..
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?