Man Killed For Harassing Lover Daughter In Sangareddy: ఈనెల 25వ తేదీన సంగారెడ్డి జిల్లా కొల్చారం మండలంలోని పోతంశెట్టిపల్లిలో చోటు చేసుకున్న హత్యను పోలీసులు ఛేధించారు. కేసు నమోదు చేసిన 36 గంటల్లోనే ఛేధించి, నేరస్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకేసులో షాకింగ్ నిజాలు వెలుగుచూసినట్లు పోలీసులు తెలిపారు. ఆ వరాల్లోకి వెళ్తే.. ఈ నెల 25న పోతంశెట్టిపల్లిలో శివారు హనుమాన్ మండల్ మంజీరా నదిలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. డెడ్ బాడీపై ఉన్న పచ్చబొట్ల ఆధారంగా.. పటాన్‌చెరు మండలం బీడీఎల్ భానుర్ పోలీస్‌స్టేషన్‌లో అవే ఆనవాళ్లతో మిస్సింగ్ కేసు నమోదైనట్టు పోలీసుగు గుర్తించారు. చివరికి ఆ మృతదేహం పటాన్‌చెరు మండలం పాటి ఘనపూర్‌కు చెందిన కావలి రాములు (35)గా గుర్తించారు.
VRO Job Fraud: ఉద్యోగం పేరుతో నిరుద్యోగులకు వీఆర్వో టోకరా.. లక్షల్లో వసూలు
మృతదేహం ఎవరితో తెలియడంతో.. పోలీసులు తమ విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే రాములుకు నందిగామకు చెందిన మ్యాదరి వీరమణితో వివాహేతర సంబంధం ఉన్నట్లు కనుగొన్నారు. ఆమెని అదుపులోకి తీసుకొని విచారించగా.. పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి. తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న రాములు.. మైనర్ అయిన తన కూతురిపై కూడా కన్నేశాడని, పలుమార్లు అసభ్యంగా ప్రవర్తించాడని వీరమణి తెలిపింది. అతడ్ని దూరం పెట్టినా.. వేధింపులు ఆగలేదని పేర్కొంది. ఈ విషయాన్ని తాను కుటుంబ సభ్యులు తెలియజేసి, అతడ్ని అంతమొందించాలని పథకం వేశామని పేర్కొంది. ప్లాన్ ప్రకారం.. మే 17వ తేదీన మెదక్‌లోని బంధువులకు ఇంటికి వెళ్లిన వీరహని, తన వద్దకు రావాలని రాములుకు సమాచారం అందించింది. దీంతో.. అతను అక్కడికి వెళ్లాడు.
Pawan Kalyan: తెలుగువారి ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ ప్రతీక.. ఢిల్లీ దాకా సత్తా చాటారు
అయితే.. రాములుని హతమార్చేందుకు అప్పటికే వీరమణి కుటుంబ సభ్యులు అక్కడ సిద్ధంగా ఉన్నారు. రాములు అక్కడికి చేరుకోగానే.. ఇనుపరాడ్డుతో అతని తలనపై గట్టిగా బాదారు. ఆ దెబ్బలకు అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం రాములు మృతదేహాన్ని గోనె సంచిలో మూటకట్టి, ఆటోలో మెదక్ నుంచి కొల్చారం మండల పరిధిలోని హనుమాన్ బండల్ నది సమీపంలో పడేసినట్టు వీరమణి విచారణలో వివరించింది. ఆమె వాంగ్మూలం ఆధారంగా.. పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్డు, ఆటోను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.