వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలలో చిచ్చుపెడుతున్నాయి. పరాయి వారి మోజులో పడి .. కట్టుకున్నవారిని, కన్నబిడ్డలను వదిలేస్తున్నారు. పరువు మర్యాదులను బజారుకీడుస్తున్నారు. తాజాగా ఒక వ్యక్తి భార్యను కాదని వేరొక మహిళతో అఫైర్ పెట్టుకొన్నాడు. ఆ విషయం భార్యకు తెలియడంతో ప్రేయసిని వదలలేక, భార్యతో ఉండలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. అమీన్‌పూర్ టైలర్స్ కాలనీకి చెందిన శ్రీకాంత్‌రెడ్డి(35) చందనగర్‌లోని ఓ ఆస్పత్రిలో హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి పెళ్ళై ఇద్దరు పిల్లలు…