Uttar Pradesh: అపాచీ బైక్, 3 లక్షలు ఇవ్వలేదని భర్త దారుణం..
- యూపీలో దారుణం..
- కట్నంగా అపాచీ బైక్.. నగదు ఇవ్వలేదని భార్య హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: వరకట్న దాహానికి ఓ అమ్మాయి బలైంది. కట్నం ఇవ్వలేదని భార్యను ఓ వ్యక్తి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో జరిగింది. కట్నంగా ఇస్తామని చెప్పిన టీవీఎస్ అపాచీ బైక్, రూ. 3 లక్షల నగదు ఇవ్వకపోవడంతో భర్త దారుణానికి ఒడిగట్టాడు. బాధిత యువతిని ఆమె తల్లిగారి ఇంటి నుంచి తీసుకువచ్చిన భర్త, ఆమెను తీవ్రంగా కొట్టి చంపాడు.
ఈ ఘటన అమ్రోహా జిల్లాలోని బైఖేడా గ్రామానికి చెందిన సుందర్‌కి మీనా అనే యువతితో రెండేళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి కట్నం కోసం వేధించేవాడదు. దీంతో బాధిత యువతి తన తండ్రికి వేధింపుల గురించి చెప్పింది. రక్షాబంధన్ నుంచి మీనా సోహర్కాలోని తన తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటోంది. సుందర్ ప్రతీ రోజూ ఆమెను చూసేందుకు వచ్చే వాడు. అతను తన అత్తామామల ఇంట్లో భోజనం కూడా చేసే వాడని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆదివారం రాత్రి కూడా తన అత్తామామల్ని కలిసి, భార్యను ఇంటికి తీసుకువచ్చాడు.
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
Read Also: Bandi Sanjay: హిందువుల పండుగలకే ఆంక్షలు, నిబంధనలు ఎందుకు..?
ఇంటికి తీసుకువచ్చిన తర్వాత వరకట్నం విషయమై మళ్లీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కట్నం ఇవ్వకపోవడంతో ఆమెపై కర్రతో దాడి చేసి గొంతుకోసి హత్య చేసి అక్కడ నుంచి పరారయ్యాడు. హత్య విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ.. మహిళ కుటుంబీకులు పోలీస్ స్టేషన్‌కి చేరుకున్నారు.యువతి తండ్రి విజయ్ ఖడక్ బన్షీ ఆమె భర్త, అతడి తల్లి, సోదరి, మరో నలుగురిపై ఫిర్యాదు చేశారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!