Uttar Pradesh: వరకట్న దాహానికి ఓ అమ్మాయి బలైంది. కట్నం ఇవ్వలేదని భార్యను ఓ వ్యక్తి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో జరిగింది. కట్నంగా ఇస్తామని చెప్పిన టీవీఎస్ అపాచీ బైక్, రూ. 3 లక్షల నగదు ఇవ్వకపోవడంతో భర్త దారుణానికి ఒడిగట్టాడు. బాధిత యువతిని ఆమె తల్లిగారి ఇంటి నుంచి తీసుకువచ్చిన భర్త, ఆమెను తీవ్రంగా కొట్టి చంపాడు.
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలోని స్థానిక కోర్టు వరకట్న హత్య కేసులో మరణించిన మహిళ భర్త, అత్తమామలకు జీవిత ఖైదు విధించింది. దోషిగా తేలిన భర్త దర్శన్ సింగ్ (29), అతని తల్లి కమలేష్ దేవి (63)లకు ఒక్కొక్కరికి రూ.15,000 జరిమానా విధిస్తూ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి అభయ్ శ్రీవాస్తవ తీర్పు చెప్పారు.