Lovers Killed : ప్రియుడితో పారిపోయేందుకు ప్లాన్.. తనలా ఉన్న మరో అమ్మాయి మర్డర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హరియాణా పానిపత్ లో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి పారిపోయేందుకు చూడడానికి తనలాగే ఉన్న మరో యువతిని చంపింది ఓ మహిళ. దీంతో తాను చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులను నమ్మించింది. అనతరం తాను అనుకున్నట్లుగా ప్రియుడితో కలిసి పారిపోయింది. ప్రియుడితో పెళ్లికి కుటుంబ సభ్యులు నిరాకరించడం వల్లే ఈ దారుణానికి పాల్పడింది. ఈ ఘటన 2017లో జరగగా.. తాజాగా నిందితురాలికి శిక్ష పడింది. జ్యోతి క్రిష్ణ అనే ఇద్దరు యువతీయువకులు కాలేజీ నుంచే ప్రేమించుకున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకుంటామని జ్యోతి ఇంట్లో చెప్పారు. దీనికి ఆమె కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. దీంతో వారిద్దరు పారిపోయి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు.
Also Read : Astrology : మార్చి 30, గురువారం దినఫలాలు
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
జ్యోతి పారిపోయినట్లుగా ఆమె కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా ఉండేందుకు.. తనలాగే ఉండే మరో యువతిని హత్య చేయాలని నిర్ణయించారు. ఈ టీవీ సీరియల్ ఆధారంగా ప్లాన్ చేశారు. పథకం ప్రకారం సిమ్రాన్ ను చంపాలని నిర్ణయించుకుని.. 2017 సెప్టెంబర్ 5న జీటీ రోడ్డుకు రమ్మన్నారు. మొదట ఆమెతో మత్తు కలిపిన కూల్ డ్రింక్ ను తాగించారు. అనంతరం ఆమె గొంతు కోసి చంపేశారు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత సిమ్రాన్ బట్టలు మార్చారు. ఘటన స్థలంలో జ్యోతికి సంబంధించిన కొన్ని గుర్తింపు కార్డులు పడేసి వెళ్లారు. అనంతరం ఇద్దరు కలిసి పారిపోయారు. ఓ హోటల్ లో కలిసి కొద్ది రోజులు జీవించారు.
Also Read : bomb blast case: రాజస్థాన్ కోర్టు సంచలన తీర్పు.. బాంబు పేలుళ్ల కేసులో నిందితులు విడుదల
ఇదిలా ఉండగా జ్యోతి కనిపించడం లేదంటూ ఆమె కుటుంబ సభ్యులు పానిపత్ పోలీస్ స్టేషన్ లో ఓ కేసు నమోదు చేశారు. దీనిపై విచానరణ చేపట్టిన పోలీసులు.. సిమ్రాన్ మృతదేహాన్ని జ్యోతి కుటుంబ సభ్యులకు చూపించారు. సిమ్రాన్ బాడీకి ఉన్న బట్టలు, డాక్యుమెంట్ల ఆధారంగా మృతదేహం జ్యోతిదే అయి ఉంటుందని భావించారు. అనంతరం ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. అదే సమయంలో సిమ్రాన్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. అనుమానం వచ్చి సిమ్రాన్ మృతదేహం ఫొటోను ఆమె తల్లిదండ్రులకు చూపించారు. సిమ్రాన్ మెడకున్న దారం, ముక్కుపుడక ఆధారంగా ఆ ఫొటో తన కూతురుదేనని ఆమె తల్లిదండ్రులు గుర్తించారు. దీంతో చనిపోయిన అమ్మాయి జ్యోతి కాదని.. సిమ్రాన్ అని తెలుసుకున్నారు.
Also Read : CM Jagan Meets Amit Shah: అర్ధరాత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ.. ఈ అంశాలపై చర్చ
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగి జ్యోతి, క్రిష్ణను వెతికే పనిలో పడ్డారు. వారిద్దరు సిమ్లాలో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం 2020లో వారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు కోర్టు విచారణలో ఉండగానే క్షయవ్యాధితో క్రిష్ణ జైలులోనే చనిపోయాడు. ఈ ఘటనలో మొత్తం 26 మందిని విచారించిన పానిపత్ కోర్టు.. మంగళవారం తీర్పు వెల్లడించింది. జ్యోతిని దోషిగా తేల్చింది. ఆమెకు జీవిత ఖైదు విధించడంతో పాటు రూ 70 వేల జరిమాన విధించింది.
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!