Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
- ఐరోపా దేశాలను దంచికొడుతున్న ఎండలు
- తీవ్రమైన ఉక్కపోత, చెమటలతో హడల్
- కరిగిపోతున్న రహదారులు.. వంకరగా ట్రామ్ పట్టాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐరోపా దేశాలను మునుపెన్నడూ లేనంతగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే సుర్రుడు సుర్రుమంటున్నాడు. దీంతో బయటకు రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. తీవ్రమైన ఉక్కపోత, చెమటలతో అల్లాడిపోతున్నారు. దీంతో నదుల్లో.. ట్యాంక్‌ల దగ్గర స్నానాలు చేస్తూ సేదతీరుతున్నారు. ఇక తాజాగా రహదారులు కూడా కరిగిపోతున్నాయి. ట్రామ్ పట్టాలు వంకర తిరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో వేలాది మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్ 21 నుంచి ఇప్పటివరకు యూరప్‌లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా 1,300 మందికి పైగా అదనపు మరణాలు నమోదయ్యాయి. కార్లలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు, వేడి నుంచి ఉపశమనం కోసం పర్యవేక్షణ లేని నీటి ప్రాంతాల్లో ఈతకు వెళ్లి మునిగిపోయిన యువకులు కూడా ఉన్నారు.
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో అంతర్జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- Ketan Agarwal Case: తొలిసారి మీడియా ముందు నోరు విప్పిన సియా సోదరుడు.. ఏం చెప్పాడంటే..!
- Pakistan: పాకిస్థాన్‌లో హై అలర్ట్.. ఇమ్రాన్ ఖాన్ ఉన్న జైలు నుంచి 14 మంది ఖైదీలు పరార్! అసలేం జరిగిందంటే?
- Pakistan Minister: "చేతులు నరికేస్తాం".. సింధు జలాల విషయంలో భారత్‌కు పాక్ మంత్రి వార్నింగ్!
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో హీట్‌వేవ్ కారణంగా మరణాల సంఖ్య పెరగడంతో మార్చురీలు, అంత్యక్రియల కేంద్రాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. జూన్ 18 నుంచి ఇప్పటివరకు ఫ్రాన్స్‌లో కనీసం 74 మంది నీటిలో మునిగి మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు కొంత తగ్గినా, జూలైలో మరోసారి తీవ్రమైన హీట్‌వేవ్ వచ్చే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ యూరప్‌లో ప్రారంభమైన ఈ హీట్‌వేవ్ ప్రస్తుతం తూర్పు యూరప్‌కు విస్తరించింది. పోలాండ్, చెక్ రిపబ్లిక్, జర్మనీ దేశాల్లో కొత్త ఉష్ణోగ్రత రికార్డులు నమోదయ్యాయి.
తీవ్ర ఎండల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు వీలైనంత వరకు ఇంటి నుంచే పని చేయాలని హంగేరీ ప్రభుత్వం సూచించింది. అలాగే బహిరంగ పనుల సమయాలను మార్చాలని, రెస్టారెంట్లు ఉచితంగా తాగునీరు అందించాలని, ఎయిర్ కండీషన్డ్ ప్రజా కేంద్రాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే యుద్ధ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థపై హీట్‌వేవ్ మరింత భారం మోపింది. 35 డిగ్రీల నుంచి 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అత్యవసర విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు.
తీవ్ర ఎండల ప్రభావాన్ని చూపించే అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ వీడియోలో బయట ఎండలో ఉంచిన పాన్‌పై కొద్ది నిమిషాల్లోనే గుడ్లు, బేకన్ ఉడికిపోవడం కనిపించింది. జర్మనీలో రహదారులు కరిగిపోవడం, ట్రామ్ పట్టాలు వేడికి వంకర తిరగడం వంటి దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. అలాగే బెర్లిన్‌లో ప్రజలను చల్లబరచేందుకు పోలీసులు వాటర్ కానన్లతో నీటి జల్లులు చల్లగా, స్థానికులు వాటి కింద నిలబడి ఉపశమనం పొందిన దృశ్యాలు కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
🥵 It's so hot in Poland that people are frying eggs outdoors
In Warsaw, a woman left a frying pan in the sun and, after a while, cooked an egg on it.
Poland is in the grip of an extreme heatwave, with temperatures approaching 40°C in some areas. On the bright side, you can… pic.twitter.com/YKzKdUZhft
— NEXTA (@nexta_tv) June 28, 2026
🌡 Extreme heat brings all trams in Germany's Leipzig to a halt
Extreme heat has melted the sealant between asphalt and concrete. It seeped into the tram tracks and hardened, making tram operations unsafe.
All tram services across the city have been suspended until at least… pic.twitter.com/5vOzn7ihNx
— NEXTA (@nexta_tv) June 28, 2026
🥵 Germany is literally melting in the heat
In Leipzig, the extreme temperatures caused the sealant used around tram tracks to melt. It seeped into the rails and track switches before hardening into large clumps.
This is what the record-breaking heatwave is doing to Germany👇 pic.twitter.com/LfbLkCRGml
— NEXTA (@nexta_tv) June 29, 2026
Are they blaming their PM/President for the weather change? pic.twitter.com/Ixu3nqRud4
— Mr Sinha (@Mrsinha) June 29, 2026
తాజావార్తలు
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
-
HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
-
OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. ‘రెడ్ జోన్’ వార్నింగ్‌తో లీడర్ల ఉరుకులు పరుగులు..
-
Akhil Raj: హీరో అఖిల్ రాజ్ కారుపై దాడి?
-
OTR: సాయి కృష్ణ కస్టోడియల్ డె*త్.. హోమ్ మంత్రి ఎందుకు మౌనం?
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!