Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
- సియా చదువు, చేతన్‌తో పరిచయంపై తల్లి కీలక వ్యాఖ్యలు
- ఇంటర్ ఫెయిల్ తర్వాత కూతురు ఏం చేసిందో వెల్లడి
- నిశ్చితార్థానికి ముందు కేతన్ కుటుంబానికి చెప్పామన్న పూజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో అరెస్టైన సియా గోయల్ గురించి ఆమె తల్లి పూజా గోయల్ పలు సంచలన విషయాలు వెల్లడించారు. తమ కుమార్తెకు చదువుపై అంతగా ఆసక్తి లేదని.. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిందని చెప్పారు. 12వ తరగతిలో తమ కుమార్తె ఉత్తీర్ణత సాధించలేదని.. ఈ విషయాన్ని నిశ్చితార్థానికి ముందే కేతన్ అగర్వాల్ కుటుంబ సభ్యులకు చెప్పినట్లుగా తెలిపారు.
సియాకు చదువు అబ్బకపోవడంతో ఇంటి నుంచి హోమ్ బేకింగ్ వ్యాపారం మొదలు పెట్టిందని.. కేకులు, బేకరీ వ్యాపారాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఇదే విషయాన్ని కేతన్ తల్లి సహా వారి కుటుంబ సభ్యులకు ముందే తెలియజేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం సియా పూణెలోని ఓ కళాశాలలో కామర్స్ విద్యార్థిగా జాయిన్ అయినా కూడా ఇప్పటి వరకు కాలేజీకి వెళ్లలేదని పేర్కొన్నారు. సియా-చేతన్ చౌదరి మధ్య ఉన్న సంబంధంపై కూడా స్పందించారు. పూణెలోని మార్కెట్ యార్డ్ ప్రాంతంలో జరిగిన ఓ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా ఇద్దరికీ పరిచయం ఏర్పడిందని తెలిపారు. అయితే కేతన్‌తో నిశ్చితార్థం జరిగే సమయానికి వారిద్దరి మధ్య ప్రేమ సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సియా.. కేతన్‌ను దూరం పెట్టేదన్న ఆరోపణలను ఖండించారు. కేతన్ ఫోన్ చేసిన ప్రతిసారి సియా స్పందించేదని చెప్పారు.
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
చేతన్ గురించి పొరుగువారు
ఇదిలా ఉంటే.. చేతన్ చౌదరి నివసిస్తున్న శ్రీ పార్శ్వనగర్ సొసైటీకి చెందిన స్థానికులు అతడు క్రీడలను ఎంతో ఇష్టపడే వ్యక్తి అని చెప్పారు. అతని దగ్గర 150కు పైగా క్రికెట్ ట్రోఫీలు ఉన్నాయని, ఎప్పుడూ హింసాత్మక స్వభావాన్ని ప్రదర్శించలేదని పేర్కొన్నారు. చేతన్ బాబాయి ఉదయ్‌రామ్ కూడా తమ కుటుంబం ఈ ఆరోపణలను ఇప్పటికీ నమ్మలేకపోతోందని తెలిపారు. ఇక చేతన్ తరఫు న్యాయవాది రామ్ షహానే మాట్లాడుతూ.. తన క్లయింట్ ఈ కేసులో రెండో నిందితుడేనని పేర్కొన్నారు. సియా-చేతన్ మధ్య జరిగిన వేలాది ఫోన్ కాల్స్ పూర్తిగా స్నేహం, వ్యాపార సంబంధిత చర్చలేనని వాదించారు.
కేతన్ తల్లి ఏమన్నారు?
మరోవైపు కేతన్ అగర్వాల్ తల్లి రాఖీ అగర్వాల్.. సియాను సాధారణ, మర్యాదపూర్వక యువతిగానే తాము భావించామని చెప్పారు. కుటుంబ వేడుకలు, పూజలు, పుట్టినరోజు వేడుకలు, విందులకు సియా ఎన్నోసార్లు హాజరైందని గుర్తు చేసుకున్నారు. మామూలు అమ్మాయిలాగే కనిపించేదని.. ఇలా జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదని రాఖీ అగర్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!